Married Woman Killed By Husband
Husband Kills Wife : ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త దంపతుల మధ్య కొద్దికాలంలోనే మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఆవేశమో,అనుమానమో తెలియదు గానీ భర్త భార్యనుదారుణంగా హత్యచేసాడు.
కర్ణాటక లోని శివమొగ్గ జిల్లా ఆయనూరుకు చెందిన కౌసర్ ఫిజా(19) అనే యువతి టిప్పునగర్‌లో ఉండే వ్యాపారి షోయబ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయతే ఇద్దరిమధ్య ఏ విషయంలో తేడాలు వచ్చాయో తెలియదు కానీ శనివారం రాత్రి షోయబ్ భార్యను తీసుకుని నగరానికి సమీపంలోని హాలూరు గ్రామం వద్ద దారుణంగా చంపి పడేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Double Murder In Prakasam District : వైద్యం పేరుతో అత్యాచారం చేసిన భూత వైద్యుడు… బాధితురాలు, భూతవైద్యుడు హత్య