Hyderabad : హైదరాబాద్‌లో బీజేపీ నాయకుడు ఆత్మహత్య

హైదరాబాద్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

BJP leader suicide

Hyderabad :  హైదరాబాద్ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. మియాపూర్ ఆల్విన్ కాలనీలో నివసించే జ్ఞానేంద్ర ప్రసాద్ అనే బీజేపీ నాయకుడు ఈరోజు ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే  ఆయన్ను  స్ధానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జ్ఞానేంద్ర ప్రసాద్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. జ్ఞానేంద్ర ప్ర‌సాద్ మృతిప‌ట్ల ప‌లువురు బీజేపీ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించి, కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు.

Also Read : Kapil Sibal on SC: న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్న సిబల్.. న్యాయవాదుల విమర్శలు