మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి. ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోయింది. రక్త సంబంధీకులు, తండ్రి స్థానంలో ఉన్న వారు సైతం కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. అక్షర జ్ఞానం లేని వారే కాదు బాగా చదువుకున్న వారు, ఉన్నత స్థానంలో ఉన్న వారు సైతం విచక్షణ కోల్పోతున్నారు. హైదరాబాద్ లో అలాంటి ఘోరం ఒకటి చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి తమ్ముడి కూతురిపైనే అత్యాచారం చేశాడు.
పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో నివసించే వ్యక్తి దంత వైద్యుడి(డెంటిస్ట్)గా సేవలు అందిస్తున్నాడు. అతడి ఇంటికి సమీపంలోనే తమ్ముడు కూడా కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ్ముడి కూతురి(21)డాక్టర్ కన్నేశాడు.
పెదనాన్న అన్న చొరవతో తరుచూ తన ఇంటికి వచ్చే యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఇంటికి రాగా బెదిరింగి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. తనపై పెదనాన్నే అఘాయిత్యానికి పాల్పడటంతో కొద్దిరోజుల పాటు కుమిలిపోయిన యువతి చివరికి తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో వారు షీ టీమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://10tv.in/cine-producer-tonsuring-sc-young-man-at-pendurthi/
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరుసకు కూతురు అయ్యే యువతిపై, అదీ ఓ డాక్టర్.. ఇలాంటి దురాఘతానికి పాల్పడటం కుటుంబసభ్యులతో పాటు స్తానికులను షాక్ కి గురి చేసింది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు దిశ లాంటి కఠిన చట్టాలు తెస్తున్నా, ఉరి శిక్షలు విధిస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంటా, బయటా.. ఆడపిల్లకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.