Hyderabad Drug Bust : డ్రగ్ డాన్ అరెస్ట్.. రిస్క్ చేసి మరీ గోవాలో నరేంద్ర ఆర్యను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు

బడా డ్రగ్ మాఫియా డాన్ నరేంద్ర ఆర్యను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డార్క్ వెబ్ లో వివిధ యాప్స్ ద్వారా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు నరేంద్రను పట్టుకునేందుకు గోవా వెళ్లి చాలా రిస్క్ తీసుకున్నారు.

Hyderabad Drug Bust : బడా డ్రగ్ మాఫియా డాన్ నరేంద్ర ఆర్యను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డార్క్ వెబ్ లో వివిధ యాప్స్ ద్వారా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు నరేంద్రను పట్టుకునేందుకు గోవా వెళ్లి చాలా రిస్క్ తీసుకున్నారు. నిందితుడు పోలీసులపైకి కుక్కలను వదలడంతో కొంతమందికి గాయాలయ్యాయి. అయినా పోలీసులు తగ్గలేదు. అంతిమంగా ఆర్యను అరెస్ట్ చేసి భాగ్యనగరానికి తీసుకొచ్చారు. గోవాలో డ్రగ్స్ డాన్ నరేంద్ర ఆర్య డెన్ పై హైదరాబాద్ పోలీసులు దాడి చేశారు. డాన్ వింగ్ ను చేధించి నరేంద్రను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సప్లయ్ చేసినా, వినియోగించినా ఎవరినీ వదిలేది లేదని నార్కోటిక్ వింగ్ డీసీపీ గుమ్మి చక్రవర్తి హెచ్చరించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ మాఫియా ఆగడాలు మరోసారి బయటపడ్డాయి. పోలీసులు ఉక్కుపాదం మోపినా డ్రగ్స్ మాఫియా కొత్త పద్ధతుల్లో డ్రగ్స్ దందా కొనసాగిస్తోంది. ఒకప్పుడు ముంబై లాంటి మహానగరాల్లో విస్తరించిన ఈ విష సంస్కృతి హైదరబాద్‌ను తమ కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

డ్రగ్స్ మాఫియా కుర్రకారును, యువతను టార్గెట్‌గా చేసుకుంది. ఇప్పటివరకు ఆర్డర్ చేస్తే డైరెక్ట్‌గా వచ్చి డెలివరీ చేసేవారు. కానీ హైదరాబాద్ పోలీసుల నిఘా పెరగడంతో కొత్త పద్ధతుల్లో సప్లయ్ చేస్తున్నారు. తాజాగా డార్క్ వెబ్ సైట్‌లోకి కావాల్సిన డ్రగ్స్‌ను ఆర్డర్ చేస్తున్నారు. దీంతో ఈజీగా కొరియర్ ద్వారా ఇంటికి చేరుతుంది. ఇలా సప్లై చేస్తున్న మూడు ముఠాల ఆగడాలకు నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు చెక్ పెట్టారు. ఈ ముఠాలు క్రిప్టో కరెన్సీ లావాదేవీలతో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తాము గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Drug Parcels Couriers : మీ పిల్లల పేరుతో ఇంటికి పార్సిల్స్ వస్తున్నాయా? తల్లిదండ్రులు బీ కేర్‌ఫుల్ అంటున్న పోలీసులు

ఈ నెట్వర్క్ మొత్తాన్ని నడిపిస్తున్న గోవాకు చెందిన డ్రగ్ డాన్ నరేంద్ర ఆర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా 450 మంది, హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సప్లై‌యర్లు, 30 మంది వినియోగదారులు నరేంద్ర ఆర్య వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా సభ్యులతో పాటు హైదరాబాద్‌లో డ్రగ్ పెడలర్స్‌గా పని చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి దగ్గరి నుంచి లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

డార్క్ వెబ్‌లో కోడ్ లాంగ్వేజ్ ద్వారా నచ్చిన డ్రగ్స్‌ ఆర్డర్ చేసి.. క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేస్తే ఇంటికే కొరియర్ ద్వారా డ్రగ్స్‌ పంపుతున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. నరేంద్ర ఆర్య అరెస్ట్‌తో వ్యాపార, రాజకీయ, సినీ రంగాల ప్రముఖుల్లో గుబులు మొదలైంది. ఈ రంగాలకు చెందిన 30మంది వీరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామని సీవీ ఆనంద్ తెలిపారు. వీరందరిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గత నెల రోజుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్న 600 మందిని గుర్తించామని ఇందులో స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. వీరందరికి రిహాబిలిటేషన్ సెంటర్స్ లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.