×
Ad

Brothel House : వ్యభిచార గృహం నిర్వాహకులపై పీడీ యాక్ట్

ఆన్ లైన్ లోవ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై  హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

  • Published On : May 28, 2021 / 04:25 PM IST

Hyderabad Police Filed Pd Act 2 Persons For Running A Brothel House

Brothel House : ఆన్ లైన్ లోవ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై  హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మిర్యాలగూడకు చెందిన అల్లని శ్యాం(49) విజయవాడకు  చెందిన రామిశెట్టి సంధ్య(32) లకు తేలిగ్గా డబ్బు  సంపాదించాలనే ఆలోచన వచ్చింది.  హైదరాబాద్ కు వచ్చి లోకాంటో వెబ్ సైట్ లో యువతుల అర్ధనగ్న చిత్రాలతో  ఆన్ లైన్ ద్వారా వ్యభిచారం చేయటం మొదలెట్టారు.

పేదింటి యువతులు, మహిళలు, ఒంటరి మహిళలు, కార్మికులకు డబ్బు ఆశ చూపి వారి ద్వారా వ్యభిచారం నిర్వహించటం మొదలెట్టారు. మార్చి నెలలో అలకాపురి లోని ఓ అపార్ట్ మెంట్ లో పోలీసులు  దాడిచేసి నిర్వాహాకులతో పాటు పలువురు యువతులను రక్షించారు. అనంతరం నిర్వాహకులు ఇద్దరినీ రిమాండ్ కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిందితులపై పీడీయాక్ట్   విధించినట్లు చైతన్యపురి పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.