Sensation at Rajendranagar, dead body found in suitcase : హైదారాబాద్..రాజేంద్ర నగర్ లో సూట్ కేస్ లో శవం కలకలం రేపింది. దుండగులు ఒక యువకుడిని హత్యచేసి సూట్ కేస్ లో పెట్టి పడేసి పోయారు. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వద్ద రోడ్డు పక్కన సూట్ కేసును గమనించారు. దాన్ని తెరిచి చూడగా అందులో మృతదేహం ఉంది. మృతుడ్ని చాంద్రాయణ గుట్టకు చెందిన జేబుదొంగ రషీద్ గా గుర్తించారు.
డాగ్ స్క్వాడ్ ను,క్లూస్ టీం ను రంగంలోకి దింపిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు జేబు దొంగతనాలు చేసి జీవించేవారు. వారిలో ఇద్దరు తామే రషీద్ ను హత్యచేసి పడేసినట్లు ఒప్పుకున్నారు. హత్య కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా… నిందితులు పాతకక్షల కారణంగా హత్య చేశారు ? డబ్బుల పంపంకంలో తేడాల వల్ల హత్య చేశారా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.