Iifl Manager Cheating
IIFL Manager 14.5 Kg Gold Cheating: IIFL బ్యాంక్ మేనేజర్ నిర్వాకం బయటపడింది. బ్యాంకులో వినియోగదారులు పెట్టిన తనఖా బంగారం తన సొంతమనుకున్నాడేమో..ఆ బంగారాన్ని మాయం చేశాడు. మాయం చేసిన బంగారాన్ని ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…ఇకపై బ్యాంకులో బంగారం తనఖా పెట్టాలంటే భయపడాల్సిందే. మాయం చేసిన ఆ బంగారాన్ని సదరు మేనేజర్ బెట్టింగ్ లో పెట్టాడు..!! ఐఐఎఫ్ ఎల్ బ్యాంకు మేనేజర్ చేసిన ఈ ఘనత బయటపడింది.
ఆ బంగారాన్ని ఏకంగా క్రికెట్ బెట్టింగ్ కోసం పెద్ద మొత్తంలో పందెం కాశాడు మేనేజర్ రాజ్ కుమార్.తనఖా పెట్టిన 14.5 కిలోల బంగారాన్ని మాయం చేసి క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు మేనేజర్ రాజ్ కుమార్. బెట్టింగ్ లకు అలవాటుపడిన రాజ్ కుమార్ ఏకంగా తన పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకులోని బంగారం కాజేసి..వన్ స్టార్ బెట్ యాప్ లో రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ కాశాడు.
కోట్ల రూపాయల బెట్టింగ్ కి పాల్పడ్డ రాజ్ కుమార్ తన దగ్గర అంత మొత్తం లేకపోవడంతో..అతని కళ్లు తను పనిచేసే బ్యాంకులో ఉన్న బంగారంపై పడ్డాయి.అంతే ఠక్కున మాయం చేసిన ఎంచక్కా బెట్టింగ్ లో పెట్టేశాడు ఈ బెట్టింగ్ బంగార్రాజు రాజ్ కుమార్. ఇతగాడి నిర్వాకంపై ఐ ఐ ఎఫ్ ఎల్ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ఆ బంగారాన్ని ఏం చేశాడనేది ఆరా తీస్తున్నారు. దీంతో తమ బంగారం కావాలని గోల్డ్ లోన్ ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.