Sasikala : శశికళకు షాక్…బినామీ ఆసల్తు జప్తు చేసిన ఆదాయపన్ను శాఖ

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు చెందిను సుమారు రూ. 15 కోట్లు విలువైన భవనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు   తాజాగా జప్తు చేశారు.

Vk Sasi Kala

Sasikala : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు చెందిను సుమారు రూ. 15 కోట్లు విలువైన భవనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు   తాజాగా జప్తు చేశారు. చెన్నై, టీనగర్, పద్మనాభన్ వీధిలో ఆమె బినామీకి చెందిన ఆంజనేయ ప్రింటర్స్ ను నిన్న మనీల్యాండరింగ్ కింద సీజ్ చేసింది.

2017-21 మధ్య కాలంలో శశికళకు   చెందిన సుమారు రూ.2 వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అయిన సంగతి తెలిసిందే.  2017 నుంచి 150 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ దాడులు చేసి  వీటిని స్వాధీనం చేసుకుంది. ఆ సమయంల శశికళ బెంగుళూరులోని పణప్పర అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.  ఈ కాలంలో  ఆదాయపన్ను శాఖ 84 ప్రాపర్టీలను రెండు దశల్లో జప్తు చేసింది.

వీటిలో శశికళ ఇతరులకు చెందిన సిరుతవూర్‌ ఫామ్‌ హౌజ్‌తో పాటు కొడనాడు ఎస్టేట్‌లోని ఆమె వాటా సైతం ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాగరన్‌ పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. 2021 లో బెంగుళూరు జైలు నుంచి విడుదలైన శశికళ ప్రస్తుతం ఏఐఏడీఎంకే చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు.

Also Read : Ganja Seized : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత