Ganja Seized : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు వెల్లుల్లి రవాణా మాటన గంజాయి రవాణా చేస్తున్న ఘరానా ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరియు  ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్క సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు తెల్లవారు  ఝామున ఎన్ ఫోర్స్ మెంట్   అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.

Ganja Seized : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత

Ganja Seized

Ganja Seized : ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు వెల్లుల్లి రవాణా మాటన గంజాయి రవాణా చేస్తున్న ఘరానా ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరియు  ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్క సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు తెల్లవారు  ఝామున ఎన్ ఫోర్స్ మెంట్   అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.

ఈక్రమంలో ఒడిస్సాలోని మల్కనగిరి నుండి మహారాష్ట్ర సోలాపూర్‌కు   వెల్లులిని రవాణా చేస్తున్న వ్యాన్ ను  ఆపి అధికారులు తనిఖీ చేశారు. అందులో దాచి ఉంచిన 58 లక్షల 65 వేల రూపాయలు విలువచేసే 391 కేజీల గంజాయిని గుర్తించారు. వెల్లుల్లి  బస్తాల మధ్యలో ఉంచి గంజాయి పార్సిల్స్ ఉంచి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను  అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వారిద్దరినీ పోలీసు స్టేషన్ కు తీసుకవెళ్లి విచారంచగా హైదరాహాద్ నుంచి వెల్లుల్లి పాయ లోడు   తీసుకుని ఆంద్రప్రదేశ్ లోని చింతూరుకు వెళ్లామని.. అక్కడ ఒరిస్సాలోని మల్కనగిరి నుంచి వచ్చిన  లారీ లోడులోని గంజాయిని తీసుకుని   మహారాష్ట్ర వెళుతున్నట్లు నిందితులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 391 కిలోలు వచ్చింది. దీని విలువ మార్కెట్ లో సుమారు రూ.58,65,000 లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు 9 క్వింటాళ్ళ వెల్లులిపాయ బస్తాలను, లారీని, గంజాయిని సరఫరా చేస్తున్న  హైదరాబాద్‌కు చెందిన అంజద్‌ఖాన్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం