Punjab: నలుగురు జవాన్లను కాల్చి చంపింది తోటి జవానే..

కాల్పులు జరిపిన ఆ జవాన్ పేరు మోహన్ దేశాయ్. అయితే విచారణకు ముందు నలుగురు జవాన్ల హత్యకు సంబంధించి మోహన్ దేశాయ్ ఇచ్చిన వాంగ్మూలం కేసును తప్పుదోవ పట్టింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తెల్ల కుర్తా పైజమా ధరించి రైఫిల్, గొడ్డలి పట్టుకొని కాల్పులు జరిపి నలుగురు జవాన్లను చంపారని తెలిపాడు

Bathinda military base

Punjab: ఏప్రిల్ 12న భటిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు జరిపి నలుగురు ఆర్మీ జవాన్లను పొట్టనపెట్టుకుంది తోటి జవానే అని తెలిసింది. వివరాలు తెలిసిన వెంటనే పంజాబ్ పోలీసులు అతడిని సోమవారం అరెస్ట్ చేశారు. వ్యక్తిగత శత్రుత్వంతోనే ఈ కాల్పులు జరిపాడని, ఇందులో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని ఆర్మీ, పంజాబ్ పోలీసుల సంయుక్త విచారణలో తేలినట్లు మీడియాకు వెల్లడించారు. నిందితుడైన జవానును విచారించగా తనను తీవ్రంగా వేధిస్తున్నారని, అందుకే కాల్పులు జరిపినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు.

Apple Mumbai Store : ఆపిల్ ముంబై స్టోర్ ఫస్ట్ లుక్ అదుర్స్.. ఏప్రిల్ 18న కస్టమర్లకు స్పెషల్ ఎంట్రీ..!

కాల్పులు జరిపిన ఆ జవాన్ పేరు మోహన్ దేశాయ్. అయితే విచారణకు ముందు నలుగురు జవాన్ల హత్యకు సంబంధించి మోహన్ దేశాయ్ ఇచ్చిన వాంగ్మూలం కేసును తప్పుదోవ పట్టింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తెల్ల కుర్తా పైజమా ధరించి రైఫిల్, గొడ్డలి పట్టుకొని కాల్పులు జరిపి నలుగురు జవాన్లను చంపారని తెలిపాడు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే దేశాయ్ ఈ కథనాన్ని రూపొందించారని ఆర్మీ సోమవారం తెలిపింది. ప్రాణాంతకమైన కాల్పులకు రెండు రోజుల ముందు యూనిట్ గార్డు గది నుంచి INSAS అసాల్ట్ రైఫిల్ పోయింది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం కాలువలో ఆయుధం లభ్యమైంది.

Harish Rao : నాపై విమర్శలు కాదు.. మీకు చేతనైతే విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదాపై పోరాడండి : ఏపీ మంత్రులకు హరీశ్ రావు కౌంటర్

“జవాన్లను చంపడానికి ఉపయోగించిన ఆయుధం, బుల్లెట్లను దేశాయ్ దొంగిలించాడు. అనంతరం ఒక కథనం రూపొందించాడు. నిందితుడైన జవాన్ పోలీసులను గందరగోళానికి గురిచేస్తున్నాడు’’ అని పంజాబ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ విషయమై ఆర్మీ ఒక ప్రకటన చేసింది. హంతకుడు మోహన్ దేశాయ్ INSAS రైఫిల్‌ను దొంగిలించడం, అతని నలుగురు సహచరులను చంపడంలో తన ప్రమేయం గురించి పోలీసుల ముందు అంగీకరించినట్లు స్పష్టం చేసింది.