Apple Mumbai Store : ఆపిల్ ముంబై స్టోర్ ఫస్ట్ లుక్ అదుర్స్.. ఏప్రిల్ 18న కస్టమర్లకు స్పెషల్ ఎంట్రీ..!
Apple Mumbai Store : భారత్‌లో ఆపిల్ ఫస్ట్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు ప్రారంభం కానున్నాయి. ముందుగా ముంబైలోని ఆపిల్ (BCK Store)లో ఏప్రిల్ 18న అధికారికంగా ప్రారంభం కానుంది.

Apple Mumbai store first look, officially opens on April 18 for customers
Apple Mumbai Store : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్లలో ముంబై (Apple BKC) స్టోర్ ఏప్రిల్ 18న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి కంపెనీ CEO టిమ్ కుక్ (Tim Cook) హాజరై కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు. ముంబై స్టోర్ అద్భుతమైన డిజైన్, భారీ గ్లాసు ఫిటింగ్ మోడల్ కలిగి ఉంది. స్టోర్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే విజిటర్లకు ఎత్తైన పైకప్పు, స్తంభాలతో కూడిన విశాలమైన ఇంటీరియర్ వెల్‌కమ్ చెబుతుంది. వచ్చే సందర్శకుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండేలా అద్భుతంగా స్టోర్ డిజైన్ చేశారు. ముంబై స్టోర్‌లోని డెస్క్‌లు సమాంతరంగా వరుసలో ఉంటాయి.
ముంబై స్టోర్‌లో ప్రధానంగా ఐఫోన్ 14 Pro, ఐఫోన్ 14 లైనప్‌తో సహా లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌ల ప్రదర్శించనుంది. అంతేకాదు.. స్టోర్ ముందు భాగంలో ఐఫోన్లను ప్రదర్శించనున్నారు. ఈ స్టోర్ మొదటి అంతస్తులో iPhone, Mac, ఇతర Apple ఉత్పత్తి యూజర్లకు క్యాటరింగ్, అప్లియేన్సెన్ కోసం ప్రత్యేక సెక్షన్ కూడా ఉంది. (HomePod), Apple TV+ కు సంబంధించి స్పెషల్ సెక్షన్ కూడా ఉంది. (Apple) విభిన్న శ్రేణి ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించనుంది.
ఈ ముంబై స్టోర్‌లో పనిచేసే ఉద్యోగుల్లో 20 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడే 100 మందిని నియమించారు. (Apple BKC) స్టోర్ ద్వారా వచ్చే కస్టమర్లకు మంచి కస్టమర్ కేర్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. ఆపిల్ బ్రాండ్ తగినట్టుగా BKC స్టోర్‌ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆపిల్ స్టోర్లలో ఒకటిగా రూపొందించారు.

Apple Mumbai store first look, officially opens on April 18 for customers
ఈ స్టోర్ ప్రత్యేక సోలర్ సౌకర్యాన్ని కలిగి ఉంది. శిలాజ ఇంధనాలపై జీరో రిలయన్స్‌తో పనిచేస్తుంది. కార్బన్ తటస్థంగా, 100 శాతం పునరుత్పాదక శక్తితో రన్ అవుతుంది. ఈ ముంబై స్టోర్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి ప్రత్యేకమైన సీలింగ్ డిజైన్. త్రిభుజాకార హ్యాండ్‌క్రాఫ్ట్ ఆకృతితో చెక్కతో తయారైంది. పైకప్పు స్టోర్ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది.
స్టోర్ టాప్ రూప్ 1,000 టైల్స్ కలిగి ఉంటుంది. ప్రతి టైల్ 408 చెక్క ముక్కలతో తయారైంది. 31 మాడ్యూళ్లను కలిగి ఉంది. ఈ స్టోర్ రూపకల్పనలో చూపించిన నైపుణ్యం ప్రతి డిజైన్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. చూడటానికి అద్భుతంగా కస్టమర్లను కట్టిపడేసేలా స్టోర్ నిర్మాణాన్ని రూపొందించారు. ముంబైలోని Apple BKC స్టోర్ వెలుపల ఉన్న ఆపిల్ ఔత్సాహికులకు, కస్టమర్‌లకు ల్యాండ్‌మార్క్ డెస్టినేషన్‌గా మారనుంది. ఆపిల్ అత్యాధునిక ఉత్పత్తులను, స్థిరత్వానికి నిబద్ధతను ప్రదర్శిస్తూ అద్భుతమైన రిటైల్ అనుభవాన్ని అందించనుంది. భారత మార్కెట్లో ఆపిల్ తమ ఉనికిని మరింత విస్తరించడంలో BKC స్టోర్ ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.