విజయవాడ: పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జయరాం మేనకోడలు
విజయవాడ: పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జయరాం మేనకోడలు శ్రిఖాచౌదరి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపెట్టింది. తన మేనమామ జయరాంతో తనకు వివాహేతర సంబంధం ఉందని శ్రిఖాచౌదరి అంగీకరించింది. ఓ విల్లా విషయంలో రాకేష్‌రెడ్డితో తనకు గొడవ జరిగిందని తెలిపింది. రాకేష్‌రెడ్డి జయరాంను చంపుతాడని అనుకోలేదని వాపోయింది. చెక్ పవర్ మేనమామ జయరాం భార్య పద్మజ పేరుతో ఉందని, దీంతో మామయ్యకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాని శ్రిఖా చెప్పింది.
జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిని జగ్గయ్యపేట సిమెంట్ ఫ్యాక్టరీలో పోలీసులు విచారిస్తున్నారు. వత్సవాయి పోలీస్ స్టేషన్‌లో మరో మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఆ మహిళ శ్రిఖాచౌదరి పీఏ అని తెలుస్తోంది. మీడియాను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగా.. నందిగామ పీఎస్‌లో కొంతమందిని, జగయ్యపేట పీఎస్‌లో మరికొందరిని, వత్సవాయి పోలీస్ స్టేషన్‌లో ఇంకొందరని విచారిస్తున్నారు. ఈ కేసులో రాజకీయ నాయకుల జోక్యం ఉందని, కేసుని తప్పుదోవ పట్టించేందుకు వారు ఒత్తిడి చేస్తున్నారని, కోట్ల రూపాయలు చేతులు మారాయని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన శ్రిఖాచౌదరి:
* జయరాం మామయ్యతో వివాహేతర సంబంధం నిజమే
* ఓ విల్లా విషయంలో నాకు, రాకేష్‌రెడ్డికి మధ్య గొడవ జరిగింది
* నాకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి
* ఇద్దరితో విడాకులు తీసుకున్నా
* రాకేష్ పరిచయం కావడంతో రెండో భర్తను వదిలేశా
* రాకేష్‌ను పెళ్లి చేసుకుందామనుకున్నా
* మామయ్య జయరామ్ వల్ల రాకేష్‌కు దూరం కావాల్సి వచ్చింది
* జయరాంకు రాకేష్‌ను నేనే పరిచయం చేశా
* రాకేష్‌కు సొంత వ్యాపారం అంటూ ఏమీ లేదు
* జయరాంకు రాకేష్ రూ.4.5కోట్లు అప్పు ఇచ్చాడు
* చెక్ పవర్ అత్త చేతిలో ఉండటం వల్ల మామయ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు
* అందుకే మామయ్య చాలామంది దగ్గర అప్పు చేశారు
* ఆ డబ్బు మామయ్య సకాలంలో తిరిగి చెల్లించలేదు
* ఈ విషయంలో రాకేష్‌కు నాకు తరచూ గొడవలు జరిగేవి
* నేను దూరం కావడానికి మామయ్యే కారణం అని తెలిసి మామయ్య జయరాంపై రాకేష్ పగ పెంచుకున్నాడు
* జయరాం హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు
* హత్య జరిగిన రోజు శ్రీకాంత్‌తో వికారాబాద్‌కు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లా
* ఉ. 6గంటలకు అమ్మ ఫోన్ చేసి మామయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పింది
* నేను, శ్రీకాంత్ కలిసి మామయ్య ఇంటికి వెళ్లి జగ్గయ్యపేటలో నాకు రాసిచ్చిన 10 ఎకరాల భూమి పత్రాల కోసం వెతికాం
* తర్వాత మామయ్యను మృతదేహాన్ని చూసేందుకు విజయవాడ వెళ్లాం
* మామయ్య జయరాం వ్యక్తిగతంగా మంచోడు కాదు
* నన్ను, చెల్లిని లైంగికంగా వేధించారు
* చెల్లికి మామయ్యే మెడికల్ సీట్ ఇప్పించారు
* మామయ్య వేధింపులు తట్టుకోలేక చెల్లి దూరంగా ఉంటుందో
* మేనకోడలినైన నాతోనూ శారీరక సుఖం కోరుకునేవాడు
* ఇదంతా నా వ్యక్తిగత జీవితం.. నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకున్నా
* పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తా