కన్నడ నటుడు దర్శన్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఒకరు మిస్సింగ్, మరొకరు..?

ప్రియురాలి కోసం అభిమానిని హత్య చేసిన కేసులో జైలు పాలైన కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

Kannada Actor Darshan with Mallikarjun B Sankanagoudar (File Photos)

Kannada Actor Darshan : అభిమాని హత్యకేసులో జైలుపాలైన కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దర్శన్ మాజీ మేనేజర్ మల్లిఖార్జున్ బి సంకనగౌడ్ అదృశ్యం మిస్టరీ తాజాగా తెరపైకి వచ్చింది. 8 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన అతడి జాడ ఇప్పటికీ లభ్యంకాకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు కూడా ఇప్పటవరకు అతడిని కనిపెట్టలేకపోయారు. అటు దర్శన్ కూడా ఈ విషయంపై మౌనంగా ఉండడంతో అనుమానాలు రెట్టింపు అవుతున్నాయి. మల్లిఖార్జున్ అసలు బతికే ఉన్నాడా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

కర్ణాటకలోని గడగ్ జిల్లాకు చెందిన మల్లిఖార్జున్.. దర్శన్‌తో సన్నిహితంగా పనిచేశాడని వన్ ఇండియా వెల్లడించింది. దర్శన్‌ సినిమా షెడ్యూల్స్ తో పాటు ఇతర వ్యవహారాలను అతడు చూసేవాడు. అక్కడితో ఆగకుండా సినిమా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ లోకి ప్రవేశించారు. సినిమాల్లో నష్టాలు చవిచూడడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు.

సీనియర్ నటుడు అర్జున్ సర్జా నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకుని చెల్లించలేదు. దీంతో మల్లిఖార్జున్ నుంచి అప్పు వసూలు చేయడానికి అర్జున్ దావా వేశారు. దర్శన్‌కు సంబంధించిన 2 కోట్ల రూపాయల డబ్బును కూడా మల్లిఖార్జున్ దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా అదృశ్యం కావడం పలు ప్రశ్నలను రేకిత్తించింది. తాజాగా అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రియురాలు పవిత్రా గౌడతో సహా దర్శన్ అరెస్ట్ కావడంతో మల్లికార్జున్ మిస్సింగ్‌పై అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read: కన్నడనాట సంచలనం రేపిన స్టార్ హీరో దర్శన్ అరెస్ట్.. ఎవరీ పవిత్రా గౌడ?

దర్శన్ ఫామ్‌హౌస్ మేనేజర్ ఆత్మహత్య
బెంగళూరులో ఉన్న దర్శన్ ఫామ్‌హౌస్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిప్రెషన్‌తోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమేయం లేదని ఫోన్‌లో రికార్డు చేసిన వీడియోలో పేర్కొన్నాడు. ఈ కేసులో విచారణ పేరిట తన ఫ్యామిలీ మెంబర్లను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరాడు.

Also Read: భర్తను చంపేందుకు కిలేడీ ఖతర్నాక్ ప్లాన్.. మూడేళ్ల వరకు కనిపెట్టలేక పోయారు.. ఇన్ని ట్విస్టులా?

ట్రెండింగ్ వార్తలు