తీవ్ర విషాదం.. బుల్లితెర నటి శోభిత బలవన్మరణం…

శోభిత మృతిపై కుటుంబసభ్యులు, బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Actress Shobitha (Photo Credit : Google)

Actress Shobitha : హైదరాబాద్ గచ్చిబౌలిలో కన్నడ బుల్లి తెర నటి శోభిత బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీరామ్ నగర్ కాలనీ సీ బ్లాక్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నారు. భర్తతో కలిసి ఆమె నివాసం ఉంటున్నారు. శోభిత కన్నడలో చాలా సీరియల్స్ లో నటించారు. శోభిత మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీలో కన్నడ బుల్లి తెర నటి శోభిత తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. శోభిత భర్త సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కన్నడలోని పలు సీరియల్స్ లో శోభిత నటించింది. బుల్లితెర నటిగానే కాకుండా యాంకర్ గానూ ఆమె అలరిస్తున్నారు. శోభిత మృతిపై కుటుంబసభ్యులు, బంధువులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా అన్యోన్యంగా ఉంటున్న వీరి కాపురంలో శోభిత ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో శోభిత సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు.

 

Also Read : బీ కేర్ ఫుల్.. యాత్రల పేరుతో ఘరానా మోసం.. ఐదేళ్లలో రూ.15 కోట్లు వసూలు..