Kalvakuntla Kanna Rao : కేసీఆర్ అన్న కొడుకు అరెస్ట్.. ఎందుకంటే

ఈ కేసులో అరెస్టుకు ముందే కన్నారావు ముందస్తు బెయిల్ కోసం రెండుసార్లు చేసిన ప్రయత్నాలను హైకోర్టు తిరస్కరించింది.

KCR Brother Son Kalvakuntla Kannarao Arrest

Kalvakuntla Kanna Rao : మన్నెగూడెం భూకబ్జా కేసులో కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావుని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. సర్వే నెంబర్ 32 ఆర్ యు యులో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్ సంస్థకు చెందిన 2 ఎకరాల భూమిని కన్నారావు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్టుకు ముందే కన్నారావు ముందస్తు బెయిల్ కోసం రెండుసార్లు చేసిన ప్రయత్నాలను హైకోర్టు తిరస్కరించింది. పోలీసులు కన్నారావుతో పాటు మరో 38మందిపై కేసులు నమోదు చేశారు.

మార్చి 3న కన్నారావుతో పాటు మరికొంతమంది వ్యక్తులు జేసీబీతో తమ కంపెనీ ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ప్రీకాస్ట్ వాల్ ని కూల్చేశారని బండోజు శ్రీనివాస్ ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు తన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, సుప్రీంకోర్టులో తప్పకుండా బెయిల్ వస్తుందని కన్నారావు తెలిపారు. పోలీసులు తనను అరెస్ట్ చేయలేదని, ఆదిభట్ల పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయినట్లు కన్నారావు తెలిపారు.

మన్నెగూడ భూ వివాదం కేసులో కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆదిభట్ల పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు రేపు కన్నారావు కస్టడీ కోరుతూ పిటీషన్ దాఖలు చేయనున్నారు ఆదిభట్ల పోలీసులు.

Also Read : తెలంగాణలో వలసల రాజకీయం.. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తేనే ఆత్మగౌరవం ఉన్నట్లా?

 

ట్రెండింగ్ వార్తలు