తెలంగాణలో వలసల రాజకీయం.. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తేనే ఆత్మగౌరవం ఉన్నట్లా?

అధికారం కోసమో.. అభివృద్ధి పనుల కోసమో పార్టీ మారితే మారొచ్చు. కానీ టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏం పద్దతని ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది.

తెలంగాణలో వలసల రాజకీయం.. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తేనే ఆత్మగౌరవం ఉన్నట్లా?

Telangana Valasala Raajakeeyam : పవర్ లేకపోతే ఎంతపెద్ద లీడర్‌ అయినా.. మాజీ నేత కావాల్సిందే. నేమ్ బోర్డు మారాల్సిందే. అదొక్కటనే కాదు అధికారంలో ఉన్నప్పుడున్నంతా మంది.. మార్బలం.. ప్రభుత్వ సౌకర్యాలు..మీడియాలో ఎక్స్‌ పోజర్ ఇవేవి ఉండవు. పేరుకు ముందు పదవుల పేరుతో కూడి ట్యాగ్‌లూ ఉండవు. అందుకే ఎవరేమనుకున్నా ఎన్ని విమర్శలు చేసినా విలువలు, సిద్ధాంతాలన్నింటి లైట్ తీసుకుని పవర్ ఉన్న దగ్గర వాళిపోవడానికే ఇష్టపడున్నారు లీడర్లు. తెలంగాణలో ఇప్పుడు ఇదే రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్‌ పవర్‌లో ఉన్నప్పుడు పదవులు, అధికార హోదాలు అనుభవించి పవర్ పోగానే.. అవమానాలు, ఆత్మగౌరవాలని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు లీడర్లు.

వరంగల్‌ బీఆర్ఎస్‌ పార్టీలో రచ్చ
అధికారం కోసమో.. అభివృద్ధి పనుల కోసమో పార్టీ మారితే మారొచ్చు. కానీ టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏం పద్దతని ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని తానే అభ్యర్థినని చెప్పుకుని చివరకు పోటీ చేయనని చెప్పి.. కాంగ్రెస్‌ గూటికి చేరారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో.. వరంగల్‌ బీఆర్ఎస్‌ పార్టీలో రచ్చ స్టార్ట్ అయింది. కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం వల్లే.. ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ లాంటి నేతలు పార్టీలో నుంచి వెళ్లిపోయారు. సరే టికెట్ ఇచ్చిన కడియం ఫ్యామిలీ అయినా పార్టీలో ఉందంటే.. ఓవర్‌నైట్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పైగా పార్టీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోటీ చేయడం లేదంటూ లేఖ రిలీజ్ చేశారు కడియం కావ్య.

Also Read: కాంగ్రెస్‌కి గురువు కేసీఆర్, ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు- బండి సంజయ్

అభివృద్ధి అని చెప్పి.. జంపింగ్స్ బాట
పదేళ్ల పాటు బీఆర్ఎస్‌లో ఉండి.. ఇప్పుడు ఎందుకు పార్టీ మారుతున్నారని అడిగితే టక్కున గుర్తొచ్చే పదం అధికారం. అభివృద్ధి చేయడం కోసమే అధికార పార్టీలోకి పోతున్నామని చెప్తున్నారు. అభివృద్ధి అని చెప్పి అధికారం ఉన్నదగ్గరికి చేరిపోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా సంతృప్తి చెందడం లేదు పొలిటీషియన్స్. తమ నియోజకవర్గ అభివృద్ది, ప్రజల సంక్షేమం అంటూ జంపింగ్స్ బాట పడుతున్నారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల్లో వీరు మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేయండి: కేటీఆర్

ఇన్నాళ్లూ అధికారం అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు వెళ్లిపోవడం అవకాశవాద రాజకీయం అని బీఆర్ఎస్ అంటుంటే.. ఇందులో అవకాశవాదం ఏం లేదని, నియోజకవర్గ అభివృద్ది కోసమే అధికార పార్టీలోకి వెళ్తున్నామని చెప్పుకొస్తున్నారు జంపింగ్ నేతలు. సరే ఇప్పటి సంగతి ఇట్లున్నా.. వచ్చే ఎన్నికల్లో అధికారం తారుమారైతే ఈ లీడర్లందరు ఎక్కడికి వెళ్తారోనన్న ఆసక్తి కూడా అవసరం లేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అధికారం కోసం పోయినోళ్లు.. మళ్లీ అధికారం వస్తే బీఆర్ఎస్‌కు రాలేరని చెప్పలేమంటున్నారు.