Kerala: భర్తను ముక్కలు ముక్కలుగా నరికానంటూ రెండేళ్ల క్రితం పోలీసుల ముందు లొంగిపోయిన భార్య.. రెండేళ్ల తర్వాత షాకింగ్ ఘటన

నౌషాద్‌ కనిపించడం లేదని అతడి తండ్రి కూడల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తొడుపుజా, తొమ్మన్‌కూతుతో పాటు పలు ప్రాంతాల్లో వెతికినా ఏమీ దొరకలేదు. దీంతో భార్య నౌషాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే ముక్కలు ముక్కలుగా నరికానని ఒప్పుకుంది

Kerala: భర్తను ముక్కలు ముక్కలుగా నరికానంటూ రెండేళ్ల క్రితం పోలీసుల ముందు లొంగిపోయిన భార్య.. రెండేళ్ల తర్వాత షాకింగ్ ఘటన

Updated On : July 29, 2023 / 4:18 PM IST

Noushad and Afsana: కేరళలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ తన భర్తను హత్య చేసి పాతిపెట్టినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. శరీర భాగాలను సెప్టిక్ ట్యాంక్, శ్మశానవాటిక, ఇంటి లోపల, సమీపంలోని మరొక స్థలంలో పాతిపెట్టినట్లు చెప్పింది. అయితే పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వారికి మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంతలో ఒక షాక్ ఎదురైంది. సదరు మహిళ భర్త ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఇది చూసి పోలీసులు కూడా ఖంగుతిన్నారు.

Women Safety : ఆడవారికి జాగ్రత్త .. ట్రయల్ రూమ్‌లో ఉండే అద్దం గురించి ఖచ్చితంగా తెలుసుకోండి .. మీ తోటివారికి షేర్ చేయండి

అయితే ఆ మహిళ ఎందుకు భర్తను చంపిందో అనే అనుమానం వచ్చే ఉంటుంది. వాస్తవానికి భార్యపై విస్మయానికి గురై భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే దీని వెనుక ఆమె అసలైన ఉద్దేశం ఏంటని మాత్రం ఇంకా తెలిసి రాలేదు. ఈ వ్యవహారం మొత్తం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది. జిల్లాలోని కలంజూర్ ప్రాంతానికి చెందిన నౌషాద్ నవంబర్ 2021లో తన అద్దె ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. భార్య అఫ్సానాతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

Tariq Mansoor: ముస్లింలపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. బీజేపీ ఉపాధ్యక్షుడిగా అలీగఢ్ ముస్లిం యూనివర్సీ మాజీ వైస్ చాన్స్‭లర్‭ తారిఖ్ మన్సూర్‭

అయితే నౌషాద్‌ కనిపించడం లేదని అతడి తండ్రి కూడల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తొడుపుజా, తొమ్మన్‌కూతుతో పాటు పలు ప్రాంతాల్లో వెతికినా ఏమీ దొరకలేదు. దీంతో భార్య నౌషాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే ముక్కలు ముక్కలుగా నరికానని ఒప్పుకుంది. అతని మృత దేహాన్ని చాలా చోట్ల పూడ్చిపెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన అన్ని చోట్ల వెతికినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే ఆమెను అరెస్ట్ చేసిన మర్నాడే నౌషద్ కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.