Woman Suicide
Woman Suicide : ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వివాహిత మహిళ ఈరోజు తన ఇద్దరు పిల్లలతో మున్నేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వారు మున్నేరు వాగులోకి దూకటం చూసిన ఒక యువకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు గాలింపు చేపట్టగా మూడు మృతదేహాలు బయట పడ్డాయి. కేసు నమోదు చేసుకున్నపోలీసులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.