విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైందో కానీ.. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. గొడవ
విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైందో కానీ.. ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. గొడవ పడ్డారు. తిట్టుకున్నారు. అంతే.. గోపాలపట్నంలోని తన ఇంట్లో యువతి శిరీష ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మృతి వార్త తెలుసుకున్న ప్రియుడు వెంకట్ మనస్తాపం చెందాడు. నువ్వు లేక నేను లేను అంటూ.. చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరు.. ఇలా ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. అసలేం జరిగింది అనేది మిస్టరీగా మారింది. కాగా, మృతురాలు మక్కా శిరీష.. గోపాలపట్నంలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. వెంకట్ ది కంచరపాలెం. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. రోజూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. బుధవారం కూడా అలానే ఫోన్ లో మాట్లాడుకుంటుండగా చిన్న విషయంపై వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. మనస్తాపం చెందిన శిరీష ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు లేని జీవితం వ్యర్థమంటూ కంచరపాలెంలో చెట్టుకు ఉరి వేసుకుని వెంకట్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు? ఎందుకు గొడవపడ్డారు? ఏ విషయం గురించి వాగ్వాదం జరిగింది? అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.