వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీళ్లు సన్నిహితంగా ఉన్న సమయంలో చూసిన మహిళ బంధువును వారిద్దరూ హత్య చేసారు.అనంతరం పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డారు.
తమిళనాడులోని శివగంగై జిల్లా ఇడయ మేలూరుకు చెందిన పాండి అనే వ్యక్తి, మదురై తిరుమాల్ తాలుకా చైన్నైమేట్టు తూర్పు వీధికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి భార్య లక్ష్మి(32)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా చాలా సార్లు రహస్యంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు. వీళ్లిద్దరూ మార్చి 10వ తేదీన ఒక గదిలో సన్నిహితంగా ఉండడాన్ని లక్ష్మి బంధువు పేతురాజ్(40) అనే వ్యక్తి చూశాడు.
వీళ్ళిద్దరి సంబంధం బయటపెడతాడనే కోపంతో వారిద్దరూ కలిసి పేతురాజ్‌ను దారుణంగా హత్య చేసారు. అనంతరం అక్కడ నుంచి రైల్లో చెన్నైకి పారిపోయారు. పేతురాజ్ హత్యవిషయం తెలిసుకున్న శివగంగై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పాండి, లక్ష్మిల ఫోటోలు అన్ని రైల్వేస్టేషన్లకు పంపారు.
కేసు విచారణలో ఫోటోలు అందుకున్న తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట రైల్వే సీఐ వడివు కరసి శనివారం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఆ సమయంలో చెన్నై నుంచి బెంగళూరు వెళుతున్న మైసూరు ఎక్స్‌ప్రెస్‌లో నిందితులిద్దరూ వెళుతున్నట్లు సమాచారం అందింది. దీంతో జోలార్‌పేట రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపి వేసి వారి కోసం గాలించారు.
ఆ సమయంలో రైలులో ప్రయాణం చేస్తున్న లక్ష్మి, పాండిలను అరెస్ట్ చేసి శివగంగై పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే శివగంగై పోలీసులు జోలార్‌పేట రైల్వేస్టేషన్‌కు చేరుకొని నిందితులను తమ అదుపులోకి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.