విశాఖ లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

  • Publish Date - May 12, 2019 / 05:05 AM IST

విశాఖపట్నం: విశాఖపట్నంలోని  పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటనలో ప్రియుడు అక్కడికక్కడే మరణించగా, కొన ఊపిరితో ఉన్న ప్రియురాలు ఆస్పత్రిలో  చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 108లో యువతిని ఆసుపత్రికి తరలించారు. వీరు బాదంపాల్లో విషం కలుపుకుని తాగినట్లు పోలీసులు తెలిపారు.

మృతులిద్దరూ శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సీహెచ్.సత్యనారాయణ, రౌతు కమలగా గుర్తించారు. ఇరువురు బంధువులేనని పోలీసులు భావిస్తున్నారు. కమల బ్యాగు నుంచి సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది, మాకు ఆ అదృష్టం లేదు, అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదే నా చివరి కోరికంటూ కమల సూసైడ్‌ నోట్‌లో రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న అరిలోవ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.