మహారాష్ట్రలో ప్రమాదం : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి

Maharashtra Massive Fire Chemical Factory 13089

మహారాష్ట్ర ధూలేలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం ఉదయం కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 100 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం.

ధూలే జిల్లా, సిర్పూర్ తాలూకాలో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. శనివారం ఉదయం సిలిండర్లు పేలిపోయాయి. పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. కానీ కొంతమంది చిక్కుకపోయి..సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నరు. చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీసుకొస్తున్నారు.

చాలా మంది ఆచూకి తెలియడం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సిర్పూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ వెల్లడించారు. పోలీసు బృందాలు, విపత్తు నిర్వాహణ, అగ్నిమాపక దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More : భారత ఉక్కు మనిషి..అమిత్ షాపై అంబానీ ప్రశంసలు