డేటింగ్ యాప్ లో మాయలేడి వల….16 మంది విలవిల

Mahatashtra : Pune Woman arrested for robbing 16 men she men via online dating app in net : స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగటం , సోషల్ మీడియా ప్లాట్ ఫాం లు పెరగటంతో కొత్త కొత్త పరిచయాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నవారు కొందరైతే, అలా పరిచయమైన వారిచేతిలో మోసపోయి విలవిల లాడుతున్నవారు మరికొందరు.

సోషల్ మీడియా లోజరుగుతున్న మోసాల గురించి ఎన్ని రకాలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నా వారు మళ్లీ మళ్లీ సోషల్ మీడియాలో మోసపోతూనే ఉన్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ వగలాడి సోషల్ మీడియా యాప్ ద్వారా మగవాళ్లక వలవేసి వారికి డ్రగ్స్ ఇచ్చి 16 మందిని నిలువునా దోచేసిన ఘటన వెలుగు చూసింది.

బీసీఏ చదువు మధ్యలో ఆపేసిన నిందితురాలు(27) ఓ మొబైల్ సర్వీస్ ప్రోవైడర్ కంపెనీలో చేరింది. అక్కడ పని చేస్తుండగానే లాక్ డౌన్ కారణంగా ఆమె ఉద్యోగాన్ని కోల్పోయింది. ఆసమయంలో ఇంటికే పరిమితమైన ఆ యువతి ఆన్ లైన్ డేటింగ్ యాప్ టిండర్, బంబుల్ లో తన ప్రోఫైల్ క్రియేట్ చేసుకుంది.

ఆ యాప్ ద్వారా పరిచయమైన మగవారిని తన తియ్యటి మాటలతో వలలో వేసుకునేది. ఆ తర్వాత వారిని పర్సనల్ గా కలుసుకోవాలని ఉందని చెప్పి హోటల్ కు రమ్మనేది. అలా వచ్చిన వారికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి వారివద్ద ఉన్న విలువైన వస్తువులు నగదు దోచుకుని పరారయ్యేది.

ఇప్పటి వరకు 16 మంది ఆమె చేతిలో మోసపోయారు. ఈ క్రమంలో వారిలో ఒకడైన ఆశిష్ కుమార్ అనే బాధితుడు నిందితురాలి వలలో పడి పూణే లోని ఓ హోటల్ కు వెళ్లాడు. నిందితురాలు అతడికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది. అది తాగి ఆశిష్ కుమార్ స్పృహ కోల్పోగానే అతని వద్ద ఉన్న బంగారం, డబ్బుతో ఉడాయించింది.

మత్తువదిలి మెలుకువ వచ్చి చూసుకుంటే ఏముంది …ఆశిష్ కు చెందిన బంగారు ఆభరణాలు, డబ్బు మాయమయ్యాయి. నిందితురాలు కనిపించకపోవటంతో జరిగిన మోసం అర్ధం అయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఖిలాడీ లేడీ వ్యవహారం వెలుగు చూసింది. ఆశిష్ తో కలిపి ఇప్పటి వరకు ఆమహిళపై నలుగురు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆశిష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు పింప్రి-చించ్వాడాలో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్దనుంచి రూ. 15.25 లక్షల విలువవైన బంగారం. నగదు స్వాధీనం చేసుకున్నారు.కేసు విచారణలో ఉంది.