Uttar Pradesh: సమాజ్‌వాదీ పార్టీకి ఓటేయనందుకు నా భార్యను కాల్చి చంపారు.. యూపీ వ్యక్తి ఆరోపణ
మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ గెలుపొందారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అనుకున్నప్పటికీ, చర్చల అనంతరం డింపుల్ యాదవ్ వైపుకు మొగ్గు చూపారు

Man Alleges Miscreants Shot His Wife Over Not Voting for Dimple Yadav in Mainpuri Bypolls
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఆరోపణ చేశాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన మెయిన్‌పురి ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్‌కు ఓటేయలేదన్న కారణంతో తన భార్యను కాల్చి చంపారని ఆయన అన్నాడు. కొంత మంది దుండగులు తనను కారులో తీసుకెళ్తున్న సమయంలో తన భార్య జోక్యం చేసుకుందట. ఆ సందర్భంలో తన భార్యను వారు కాల్చి చంపారంటూ వెల్లడించాడు. కాసేపటికి కదులుతున్న వాహనం నుంచి తనను తోసేసి పారిపోయారని చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ గెలుపొందారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ముందుగా పార్టీ నుంచి ఎవరినైనా పోటీ చేయిద్దామని అనుకున్నప్పటికీ, చర్చల అనంతరం డింపుల్ యాదవ్ వైపుకు మొగ్గు చూపారు. ముందస్తు అంచానాలకు అనుగుణంగానే ఫలితాల్లో ఎస్పీ విజయం వైపు పరుగులు తీస్తోంది. ఎస్పీకి ఎంతో బలమైన ప్రాంతం, పైగా ములాయం మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి కారణంగా ఎస్పీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వచ్చాయి. అంతే కాకుండా, యూపీలో ప్రధాన పార్టీల్లో ఒకటైన బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉండడం కూడా ఎస్పీకి కలిసి వచ్చింది. గతంలో కూడా ఇలాంటి ఫార్ములా వర్కౌట్ అయింది.