Ayodhya Mosque: అయోధ్య మసీదు నిర్మాణానికి తొలగిన అతిపెద్ద అడ్డంకి.. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం తొందరలో ప్రారంభం

ఇక మసీదుతో పాటు పక్కనే 200 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు అథర్ హుస్సేన్ తెలిపారు. ఈ రెండు నిర్మాణాల మొత్తం వ్యయంలో మసీదుకు కేటాయించే మొత్తం కేవలం 10 శాతమేనట. మొదటి దశలో 100 కోట్ల రూపాయలతో మసీదు, ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, మసీదు నిర్మాణం పూర్తి చేస్తారట. అనంతరం మరో 100 కోట్ల రూపాయలతో రెండవ దశలో ఆసుపత్రి పూర్తి నిర్మాణం పూర్తవుతుందని అథర్ అన్నారు

Ayodhya Mosque: అయోధ్య మసీదు నిర్మాణానికి తొలగిన అతిపెద్ద అడ్డంకి.. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం తొందరలో ప్రారంభం

Ayodhya mosque plan clears major hurdle, construction to begin soon

Ayodhya Mosque: వివాదాస్పద బాబ్రీ మసీదు కూలిన ప్రాంతంలో మందిర నిర్మాణానికి అనుమతి ఇస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించి మూడేళ్లు పూర్తైంది. ఇక మసీదు నిర్మాణానికి సమీపంలోనే ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, రామమందిర నిర్మాణం ప్రారంభమై వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే పూర్తి చేసుకునే దశలో ఉంది. అయితే మసీదుకు యూపీ ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం కేటాయించినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే తాజాగా అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి ఆమోదం లభించించడంతో తొందరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి మసీదు నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి ఉన్న అడ్డంకుల్లో ఇదే అతిపెద్దదని వారు పేర్కొన్నారు.

Mumbai: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‭ను చంపుతామంటూ బెదిరింపులు

ఈ విషయమై ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్ సెక్రెటరీ అథర్ హుస్సేన్ మాట్లాడుతూ “చాలా రోజులుగా అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నుండి భూ వినియోగ ఆమోదం కోసం ఎదురు చూశాం. ఎట్టకేలకు అది లభించింది. మా స్థానిక ధర్మకర్త అర్షద్ దానిని స్వీకరించారు. ఇప్పుడు ఫైర్ క్లియరెన్స్ మాత్రమే మిగిలి ఉంది. మేము వేసిన అగ్నిమాపక ప్రణాళిక రెండు నెలల క్రితం తిరస్కరించబడింది. లోపలికి వెళ్లే మార్గం కేవలం 4.2 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నందువల్ల తిరస్కరించారు. వారి ప్రతిపాదన ప్రకారం మార్గం 9 మీటర్ల వెడల్పు ఉండాలి. దీంతో వక్ఫ్ బోర్డు, ఉత్తరప్రదేశ్ జిల్లా మేజిస్ట్రేట్ నుంచి మరింత భూమి భూమిని సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తయిన తర్వాత, నెలాఖరులోగా నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు” అని అన్నారు.

New Zealand: 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు సిగరెట్ తాగొద్దు, వారికి సిగరెట్ అమ్మొద్దు.. సంచలన చట్టం చేసిన ప్రభుత్వం

ఇక మసీదుతో పాటు పక్కనే 200 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు అథర్ హుస్సేన్ తెలిపారు. ఈ రెండు నిర్మాణాల మొత్తం వ్యయంలో మసీదుకు కేటాయించే మొత్తం కేవలం 10 శాతమేనట. మొదటి దశలో 100 కోట్ల రూపాయలతో మసీదు, ఆసుపత్రి నిర్మాణం చేపట్టి, మసీదు నిర్మాణం పూర్తి చేస్తారట. అనంతరం మరో 100 కోట్ల రూపాయలతో రెండవ దశలో ఆసుపత్రి పూర్తి నిర్మాణం పూర్తవుతుందని అథర్ అన్నారు. మొదటి దశలో పూర్తైన ఆసుపత్రిని 100 పడకలతో ప్రారంభించనున్నట్లు, ఈ కాంప్లెక్స్‌లో ఇండో-ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్/1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ఆర్కైవ్‭తో పాటు కమ్యూనిటీ కిచెన్‌తో కూడిన లైబ్రరీ కూడా ఉంటుందని తెలిపారు. ఇందులో మొదట 1,000 మందికి, తరువాత 2,000 మందికి భోజనం అందించనున్నట్లు అథర్ హుస్సేన్ వెల్లడించారు.