New Zealand: 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు సిగరెట్ తాగొద్దు, వారికి సిగరెట్ అమ్మొద్దు.. సంచలన చట్టం చేసిన ప్రభుత్వం

మంగళవారం బిల్లు చట్టంగా మారిన అనంతరం అసోసియేట్ హెల్త్ మినిస్టర్ అయేషా వెరాల్ మాట్లాడుతూ "ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాలైన ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన అవసరం లేకుండా ఆరోగ్య వ్యవస్థ 5 బిలియన్లు డాలర్లు మెరుగ్గా ఉంటుంది. క్యాన్సర్, గుండెపోటులు వంటివి చాలా వరకు తగ్గుతాయి" అని అన్నారు.

New Zealand: 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు సిగరెట్ తాగొద్దు, వారికి సిగరెట్ అమ్మొద్దు.. సంచలన చట్టం చేసిన ప్రభుత్వం

New Zealand bans cigarettes for those born on or after January 1, 2009

New Zealand: ప్రపంచంలో ఏదైనా వెంటనే రద్దు చేయాలంటే అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది పొగాకు వినియోగమే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మందిని ఈ పొగాకు వినియోగం పొట్టనపెట్టుకుంటోంది. అనేక దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పొగాకు వినియోగానికి మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నాయి. అనేక చర్చల్లో అనేక కీలక లక్ష్యాలు నిర్ణయించుకున్నప్పటికీ.. ఆచరణలో అవి కలలుగానే మిగిలిపోతున్నాయి. అయితే న్యూజీలాండ్ ప్రభుత్వం మాత్రం తమ దేశాన్ని 2025 నాటికి పొగాకు రహితంగా చేస్తామని బల్లగుద్ది మరీ చెబుతోంది. అందు కోసం ఎంత కఠిన నిర్ణయాలపై తీసుకుంటామని వెల్లడించింది.

Mumbai: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‭ను చంపుతామంటూ బెదిరింపులు

ఇందులో భాగంగా 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు సిగరెట్ తాగకూడదనే ఉద్దేశంతో ది న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం, స్మోక్‌ఫ్రీ ఎన్విరాన్‌మెంట్స్ అండ్ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ (స్మోక్డ్ టుబాకో) సవరణ బిల్లు అనే బిల్లు తీసుకువచ్చింది న్యూజీలాండ్. ఈ బిల్లుకు తాజాగా మూడో దశ ఆమోదం లభించింది. ప్రస్తుతం న్యూజీలాండ్ వ్యాప్తంగా 6,000 దుకాణాలకు అధికారికంగా సిగరెట్లు అమ్మడానికి అనుమతి ఉంది. వీటిని పది శాతానికి అంటే 600 దుకాణాలకు కుదించనున్నారు. వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్న ఈ చట్టానికి మంగళవారం మూడో దశ (ఈ దశ ఆమోదంతో చట్టం అవుతుంది) ఆమోదం లభించింది. ఇక కొత్త ఏడాది నుంచి ఇది అమలులోకి రానున్నట్లు న్యూజీలాండ్ ప్రభుత్వం పేర్కొంది.

మంగళవారం బిల్లు చట్టంగా మారిన అనంతరం అసోసియేట్ హెల్త్ మినిస్టర్ అయేషా వెరాల్ మాట్లాడుతూ “ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాలైన ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన అవసరం లేకుండా ఆరోగ్య వ్యవస్థ 5 బిలియన్లు డాలర్లు మెరుగ్గా ఉంటుంది. క్యాన్సర్, గుండెపోటులు వంటివి చాలా వరకు తగ్గుతాయి” అని అన్నారు.

Elon Musk: మరో కీలక నిర్ణయం తీసుకున్న మస్క్.. ట్రస్ట్ అండ్ సేప్టీ కౌన్సిల్ రద్దు ..

ది న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం, స్మోక్‌ఫ్రీ ఎన్విరాన్‌మెంట్స్ అండ్ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ (స్మోక్డ్ టుబాకో) సవరణ బిల్లు మూడు ప్రధాన మార్పులను చేసింది:
పొగబెట్టిన పొగాకు ఉత్పత్తులలో నికోటిన్ కంటెంట్ తగ్గించడం.
పొగాకు విక్రయించే రిటైలర్ల సంఖ్యను తగ్గించడం.
జనవరి 1, 2009న లేదా ఆ తర్వాత పుట్టిన ఎవరికైనా పొగాకు విక్రయించకూడదని నిర్ధారించుకోవడం.

India-China face off: రాజ్‌నాథ్ ప్రకటన తర్వాత లోక్‌సభలో గందరగోళం.. విపక్షాల వాకౌట్

లేబర్, గ్రీన్స్చ టె పాటి మావోరీల మద్దతుతో పార్లమెంటులో తుది దశ ఆమోదం పొందన తర్వాత ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారనుంది. వాస్తవానికి న్యూజిలాండ్‌లో ఇప్పటికే ధూమపానం చేసే వారి సంఖ్య చాలా చాలా తక్కువ. ఆ దేశవ్యాప్తంగా కేవలం 8% మంది ప్రజలు మాత్రమే ప్రతిరోజూ ధూమపానం చేస్తున్నారు. ఇది ఏడాదిన్నర క్రితం 9.4% ఉండేది. పది సంవత్సరాల క్రితంతో పోలిస్తే సగానికి సగం తగ్గింది.