Minister Kaushal Kishore: కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ ఇంట్లో యువకుడి కాల్చివేత .. మంత్రి కుమారుడి తుపాకీని స్వాధీనం

కేంద్ర మంత్రి ఇంట్లో ఓ యువకుడు కాల్చి చంపబడ్డాడు. ఆ సమయంలో తన కుమారుడు ఉంట్లో లేడని మంత్రి చెబుతున్నారు. కానీ మంత్రి కుమారుడు గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Union Minister Kaushal Kishore

Union Minister Kaushal Kishore : ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ ఇంట్లో ఓ యువకుడు కాల్చివేతకు గురై ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం (సెప్టెంబర్ 1,2023) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖా సహాయమంత్రి కౌషల్ కిషోర్ నివాసం వద్ద ఓ వ్యక్తి కాల్చి చంపబడ్డాడనే సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. చనిపోయిన యువకుడు వినయ్ శ్రీవాస్తవగా గుర్తించారు. వినయ్ తుపాకి కాల్పుల్లో మరణించినట్టు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 4.15 గంటలకు మంత్రి ఇంట్లోనే మంత్రి కౌషల్ కిషోర్ కుమారుడు పేరుమీద ఉన్న లైసెన్స్డ్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్వ్కాడ్ తో సహా వచ్చారు. అలాగే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

Ex Bihar MP : జంట హత్యల కేసులో మాజీ ఎంపీకి జీవిత ఖైదు…సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తన నివాసంలో జరిగిన ఈ ఘటనపై మంత్రి కౌషల్ కిషోర్ స్పందించారు. ఈ ఘటన జరిగిన సమయంలో తన కుమారుడు వికాశ్ కిసోర్ ఇంట్లో లేడని ఢిల్లీలో ఉన్నాడని తెలిపారు.కానీ ఈ ఘటన ఎలా జరిగిందో ఎవరు చేశారో తెలియదని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని విచారణ జరిపి బాధ్యులను శిక్షించేలా చేస్తామని తెలిపారు. వినయ్ మాతో చాలా సన్నిహితంగా ఉండేవాడని అతను ఇలా చనిపోవటం బాధాకరమని అన్నారు. వినయ్ నా కుమారుడికి మంచి స్నేహితుడు..అతని కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అలా ఈ ఘటనపై లక్నో డీసీపీ (వెస్ట్) రాహుల్ రాజ్ మాట్లాడుతు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించామని తెలిపారు. అలాగే మంత్రి కుమారుడు వికాశ్ కిషోర్ పేరున ఉన్న లైసెన్స్‌డ్ తుపాకిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశఆమని కేసు దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టు రాగానే దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కాగా.. ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు