ఇలా చేయకండి : ప్రాణం తీసిన లైవ్ వీడియో

  • Publish Date - February 16, 2020 / 07:04 PM IST

లైవ్ వీడియో, సెల్ఫీల మోజు మరింత ముదురుతోంది. వీటిని తీసుకుంటూ..చనిపోతున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో పోస్టుల కోసం డేంజరస్ ఫీట్స్ చేస్తూ..కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా వెస్ట్ బెంగాల్‌‌లో లైవ్ వీడియో తీసుకుందామని ప్రయత్నించిన ఓ యువకుడు..మృత్యులోకాలకు వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

బుర్ద్వాన్ జిల్లాలోని అండాల్ టౌన్‌లో 24 ఏళ్ల యువకుడు..బైక్‌పై వెళుతున్నాడు. సరదాగా లైవ్ వీడియో తీసి ఫేస్ బుక్‌లో పోస్టు చేద్దామని అనుకున్నాడు. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి..లైవ్ తీయడం ప్రారంభించాడు. కానీ..బండి ఒక్కసారిగా అదుపు తప్పింది. బైక్‌తో పాటు అతను రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటంసభ్యులకు అందచేశారు. 

2020, ఫిబ్రవరి 15వ తేదీ శనివారం..కాళీమాత గుడికి వెళ్లొస్తానని చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తలకు హెల్మెట్ లేదని పోలీసులు వెల్లడించారు. 

Read More : SAI ట్రయల్స్‌లో పాల్గొనను – శ్రీనివాసగౌడ