Mobile Phone Explosion : అమ్మ బాబోయ్.. జేబులో పేలిన మొబైల్ ఫోన్.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్‌కు తీవ్ర గాయాలు.. ఎందుకిలా పేలిపోతున్నాయి..

జేబులో పెట్టుకున్న ఫోన్ బాంబులా పేలిపోవడం కలకలం రేపుతోంది. ఫోన్ వాడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Mobile Phone Explosion : మొబైల్ ఫోన్ అందరి జీవితంలో భాగమైపోయింది. చాలా పనులు ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. దాంతో ఫోన్ లేనిదే పనులు కావడం లేదు. అయితే, మొబైల్ ఫోన్లతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే.. కొన్ని ఫోన్లు బాంబుల్లా పేలిపోతున్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో తీవ్ర గాయాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్ లు పేలిపోతున్న ఘటనలు పెరగడం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫోన్లు ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి జేబులో పెట్టుకున్న ఫోన్ అమాంతం పేలిపోయింది. ఈ ఘటనలో అతడి ప్రైవేట్ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజ్ గర్ జిల్లా సారంగపూర్ లో ఓ వ్యక్తి ప్యాంట్ జేబులో ఫోన్ పెట్టుకుని బైక్ పై వెళ్తున్నాడు. ఇంతలో జేబులో ఉన్న ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. పేలుడు ధాటికి ఆ వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయాడు. బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఫోన్ పేలడంతో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కాలిన గాయాలు అయ్యాయి.

Also Read : వావ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. 20వేల లోపు ప్రైస్‌లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం..

బాధితుడి పేరు అరవింద్. వయసు 19 సంవత్సరాలు. స్థానిక మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి బయలుదేరాడు. మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అతడి ప్రైవేట్ భాగాలకు గాయాలు అయ్యాయి. బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అరవింద్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

ఈ ఘటనపై అరవింద్ సోదరుడు స్పందించాడు. ఫోన్ గురించి కీలక విషయాలు చెప్పాడు. ఇటీవలే అరవింద్ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నాడని, రాత్రంతా ఛార్జింగ్ పెట్టాడని తెలిపాడు. ఉదయాన ఫోన్ ను జేబులో పెట్టుకుని కూరగాయల కొనేందుకు మార్కెట్ కి వెళ్లాడని చెప్పాడు. ఫోన్ ను జేబులో పెట్టుకుని బయటకు వెళ్లిన గంట తర్వాత అది పేలిపోయిందని వెల్లడించాడు.

జేబులో పెట్టుకున్న ఫోన్ బాంబులా పేలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఫోన్ వాడే వారిని ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అసలు ఫోన్లు ఎందుకిలా బాంబుల్లా పేలిపోతున్నాయో తెలియక కంగారు పడుతున్నారు. ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. లిథియం ఐయాన్ బ్యాటరీలతో వచ్చే ఫోన్లు.. ఓవర్ హీట్ కావొచ్చు, ఉబ్బ వచ్చు, కొన్ని సందర్భాల్లో పేలిపోవచ్చు అని నిపుణులు తెలిపారు. ఫోన్లు ఇలా పేలిపోవడానికి ఓవర్ ఛార్జింగ్, బ్యాటరీలో లోపాలు, ఎక్కువగా వేడికి ఉంచడం.. కారణాలు కావచ్చని వివరించారు.

Also Read : వావ్.. బంపర్ ఆఫర్.. ఈ రియల్‌మి 5జీ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ రాదు..!

పాత ఫోన్లు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని చెడిపోయిన బ్యాటరీ స్థానంలో నాణ్యత లేని చైనా బ్యాటరీ అమర్చుతారని చెబుతున్నారు. అలాంటి బ్యాటరీని గంటకు పైగా ఛార్జ్ చేస్తే అది వేడెక్కిపోయి పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్ ని ఎక్కువ సేపు ప్లగ్ చేసి ఉంచకూడదన్నారు. మొత్తంగా ఫోన్ తో కేర్ ఫుల్ గా ఉండాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు నిపుణులు.