Budget Smartphones : వావ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. 20వేల లోపు ప్రైస్‌లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం..
మీరు ఆశిస్తున్నట్లుగానే మార్కెట్ లో 20వేల లోపు ధరలో లేటెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాటి వివరాలు ఒకసారి చూద్దాం..

Budget Smartphones : అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు ఉండాలి, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి.. ధర కూడా 20వేల రూపాయలలోపే అయి ఉండాలి.. అలాంటి ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పాలి. మీరు ఆశిస్తున్నట్లుగానే మార్కెట్ లో 20వేల లోపు ధరలో లేటెస్ట్ ఫీచర్లతో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు అనేకం ఉన్నాయి. వాటి వివరాలు ఒకసారి చూద్దాం..
మార్కెట్ లో అనేక రకాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది బెస్ట్ అని ఎంపిక చేసుకోవడంలో కొంచెం కన్ ఫ్యూజన్ ఉండొచ్చు. గేమింగ్, ఫోటోగ్రఫీ లేదా రోజువారీ ఉపయోగం కోసం 20వేల లోపు టాప్ మొబైల్ ఫోన్ కావాలా? 2025లో అందుబాటులో ఉన్న బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వివరాలు మీ కోసం..
POCO X7
మీరు అద్భుతమైన మల్టీ మీడియా అనుభవం, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో కూడిన గొప్ప రోజువారీ వినియోగ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. POCO X7 మీకు సరసమైన ధరలో మంచి ఎంపిక.
ఫీచర్లు:
డిస్ ప్లే – 6.67 ఇంచ్.. రెజల్యూషన్ 1220 x 2712 పిక్సెల్స్
ప్రాసెసర్ – MediaTek Dimensity 7300 Ultra, octa-core CPU
కెమెరా
రేర్ – 50 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్
ఫ్రంట్ – 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ – 5500 mAh
RAM స్టోరేజ్ – 8GB RAM
128 జీబీ స్టోరేజ్
Nothing Phone 2a
గత సంవత్సరం ప్రవేశపెట్టబడిన నథింగ్ ఫోన్ ప్రత్యేకమైన డిజైన్ తో వచ్చింది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో కూడి ఉంది.
ఫీచర్లు
డిస్ ప్లే – 6.70 ఇంచ్,
1080×2412 pixels
ప్రాసెసర్ – మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్ సెట్
కెమెరా
రేర్ – 50 MP main sensor + 50 MP ultra-wide sensor
ఫ్రంట్ – 32 ఎంపీ సెన్సర్
బ్యాటరీ – 5000 mAh బ్యాటరీ కెపాసిటీ
45W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది
RAM, స్టోరేజ్ – 8GB RAM 128 జీబీ స్టోరేజ్
Also Read : వావ్.. బంపర్ ఆఫర్.. ఈ రియల్‌మి 5జీ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ రాదు..!
iQOO Z9
గేమింగ్, పనితీరు మీ ప్రాధాన్యత అయితే iQOO Z9 మీకు మంచి ఎంపిక. ఈ ఫోన్ ఈ ధర విభాగంలోని ఇతర ఫోన్‌లను సులభంగా అధిగమిస్తుంది. ఈ ఫోన్ AMOLED డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్ ఇస్తుంది.
ఫీచర్లు
డిస్ ప్లే – 6.77 ఇంచ్, 1080 x 2392 పిక్సెల్స్
ప్రాసెసర్ – MediaTek Dimensity 7300, Octa-core
కెమెరా
రేర్ – 50MP + 2MP
ఫ్రంట్ – 16MP
బ్యాటరీ -5,000mAh
RAM, స్టోరేజ్ – 8GB RAM, 128 జీబీ స్టోరేజ్
Infinix Note 40 Pro 5G
ప్రీమియం లుక్, ఆకట్టుకునే డిస్ ప్లే, కెమెరా మంచి ఆడియో కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G అనువైన ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ధర పరిధిలోని చాలా ఫోన్‌లు దీనిని అందించవు.
ఫీచర్లు
డిస్ ప్లే – 6.78 ఇంచ్ AMOLED డిప్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్ – మీడియాటెక్ డైమెన్సిటీ 7200, ఆక్టా కోర్
కెమెరా
రేర్ – 108MP మెయిన్ సెన్సార్ OIS
2MP డెప్త్ సెన్సార్
2MP మాక్రో సెన్సార్
ఫ్రంట్ – 32MP
బ్యాటరీ – 5000mAh 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 20W వైర్ లెస్ ఛార్జింగ్
RAM, స్టోరేజ్ – 8జీబీ RAM, 256 జీబీ స్టోరేజ్
Realme Narzo 70 Pro
ఇది దీర్ఘకాలం ఉండే బ్యాటరీ లైఫ్, మంచి కెమెరా, అద్భుతమైన డిస్ ప్లే కలిగిన మంచి బడ్జెట్ ఫోన్. ఈ హ్యాండ్‌సెట్ ప్లాస్టిక్‌తో రూపొందించబడింది. ఇది తేలికైనది. ఎక్కువ కాలం ఉపయోగించడానికి సౌకర్యంగా ఉంటుంది. Realme UI 5.0 తో Android 14 పై రన్ అవుతున్న ఈ ఫోన్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్. ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్లు, 5జీ కనెక్టివిటీ అదనపు ఫీచర్లు.
ఫీచర్లు
డిస్ ప్లే – 6.67 ఇంచ్ AMOLED, 2400 x 1080 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్ – MediaTek Dimensity 7050 5G
కెమెరా
రేర్ – 50MP మెయిన్ సెన్సార్ OIS, ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్
Front – 16MP
బ్యాటరీ – 5000mAh 67W SUPERVOOC ఛార్జింగ్
RAM, స్టోరేజ్ – 8GB RAM 128/256 జీబీ స్టోరేజ్
ప్రీమియం ఫోన్లకు తీసిపోని విధంగా నేడు బడ్జెట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. గతంలో ప్రీమియం ఫోన్లలో మాత్రమే లభించే ఫీచర్లు ఇప్పుడు బడ్జెట్ ఫోన్లలోనూ వచ్చేశాయి. గొప్ప కెమెరా, బ్యాటరీ లైఫ్, డిస్ ప్లే వంటి ఫీచర్లతో 20వేల లోపు ధరలోనే స్మార్ట్ ఫోన్లు అనేకం మార్కెట్ లో ఉన్నాయి. Realme, POCO, Samsung బ్రాండ్లు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. వినియోగదారులు ముఖ్యమైన ఫీచర్ల విషయంలో రాజీపడాల్సిన అవసరమే లేదు.