హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నరేందర్ గా పోలీసులు గుర్తించారు. కుటంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో నరేందర్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read | సంచలనం రేపిన రాధిక హత్య కేసులో ఊహించని ట్విస్ట్
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరేందర్ కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు నరేందర్ కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. ఆత్మహత్య కారణాల గురించి ఆరా తీస్తున్నారు.
(అందుకు కేంద్రమే కారణం.. శాంతికి నేను ప్రయత్నిస్తా: రజినీకాంత్)