ట్రయల్ వేస్తానని చెప్పి షోరూమ్ నుంచి రూ.లక్షా 41వేల 880విలువ చేసే యమహా బైక్ ఎత్తుకుపోయాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చాంద్‌ఖేడా ప్రాంతానికి చెందిన యమహా షోరూమ్‌కు పాత బైక్ తో వచ్చాడో వ్యక్తి. ఎక్స్ చేంజ్ కావాలంటూ బైక్ అక్కడ పెట్టి లక్షన్నర విలువ చేసే బైక్ తీసుకుని వెళ్లాడు. చాలాసేపటి వరకూ చూసి అతను ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేయగా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.
అప్పటికి తేరుకుని బైక్ పోయిందంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. యమహా బైక్ షోరూమ్ మేనేజర్ ఈశ్వర్ పర్మార్(29) ఫిర్యాదు మేర స్పందిందిచిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పాత బైక్ వివరాలు సేకరించడంతో హైదరాబాద్‌కు చెందిన రాహుల్ మొహమ్మద్ అనే వ్యక్తిదిగా తెలిసింది. ఎంక్వైరీలో తన బైక్ 20రోజుల ముందే పోయినట్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానని మొహమ్మద్ పోలీసులకు చెప్పాడు.
షోరూం వ్యక్తులు పాత బైక్ చూసుకుని ధీమాగా ట్రయల్‌కు కొత్త బైక్ ఇచ్చారు. ఎటువంటి ఐడెంటిటీ కార్డు లేకుండానే ఇవ్వడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. సీసీటీవీ ఆధారంగా అతని ఫొటో సంపాదించాం. వీలైనంత త్వరగా పట్టుకుని తీరతాం అని పోలీసులు చెబుతున్నారు.