Man Murder In Punjab : పొగాకు నమిలాడని కత్తులతో పొడిచి వ్యక్తి దారుణ హత్య
పంజాబ్‌లో దారుణం జరిగింది. పొగాకు నమిలాడని ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన అమృత్‌సర్‌లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన రమణదీప్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

Man Murder In Punjab
Man Murder In Punjab : పంజాబ్‌లో దారుణం జరిగింది. పొగాకు నమిలాడని ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన అమృత్‌సర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాటివిండ్ ప్రాంతానికి చెందిన హర్మన్‌జీత్ సింగ్(20) బుధవారం రాత్రి అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఉన్న రోడ్డు వద్ద బైక్‌పై కూర్చొన్నాడు. మద్యం సేవించిన అతడు పొగాకు నములుతున్నాడు. అటుగా వచ్చిన నిహాంగ్ సిక్కులు అతడి వద్దకు వచ్చారు. పొగాకు నమలడంపై ప్రశ్నించారు.
దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో ఒక నిహాంగ్ సిక్కు ఒరలో ఉన్న కత్తిని బయటకు తీశాడు. దీంతో హర్మన్‌జీత్ సింగ్ ప్రతిఘటించాడు. మరో నిహాంగ్ సిక్కు కూడా తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీసి అతడిపై దాడి చేశాడు. దీంతో హర్మన్‌జీత్ సింగ్ తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే మూడో వ్యక్తి తన వద్ద ఉన్న డాగర్‌తో హర్మన్‌జీత్ సింగ్‌పై దాడి చేశాడు. అనంతరం నిహాంగ్ సిక్కులు కూడా కత్తులతో అతడ్ని పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తీవ్రంగా గాయపడిన హర్మన్‌జీత్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. మరోవైపు ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ కొందరు వ్యక్తులు ఉన్నారు. కానీ, ఎవరూ కూడా ఆ వ్యక్తిని కాపాడలేదు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీంతో హర్మన్‌జీత్ సింగ్ మృతదేహం రాత్రంతా అక్కడే పడి ఉంది. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో హోటల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
ముగ్గురు నిందితుల్లో ఒకరైన రమణదీప్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిహాంగ్ సిక్కుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తన కుమారుడు త్వరలో విదేశాలకు వెళ్లనున్నాడని, ఇంతలో నిహాంగ్ సిక్కుల చేతుల్లో హత్యకు గురయ్యాడంటూ హర్మన్‌జీత్ సింగ్ తల్లి బోరున విలపించారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.