Raja Singh UP Elections 2022 : రాజాసింగ్ పై మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీసు స్టేషన్ లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

BJP MLA Raja Singh

Raja Singh UP Elections 2022 :  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళహాట్ పోలీసు స్టేషన్‌లో  పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఉత్తర ప్రదేశ్ ఓటర్లును ఉద్దేశించి  రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆయన్ను వివరణ కోరింది. అందుకు రాజాసింగ్ స్పందించలేదు. గడువులోగా రాజాసింగ్‌ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
Also Read : Raja Singh : రాజాసింగ్ పై ఈసీ సీరియస్.. కేసు నమోదు చేయాలని ఆదేశం
తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మంగళ్ హాట్ పోలీసులు కేసు నమోదు చేసారు. రాజాసింగ్ 72 గంటల పాటు మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా ఈసీ నిషేధం విధించింది.