Maredpalli Police Station
Hyderabad : చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారే మహిళపై అత్యాచారం చేసి కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది. వెస్ట్ మారేడ్ పల్లి పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు…. వనస్ధలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు.
అదే సమయంలో ఆమె భర్త ఇంట్లోకి రావటంతో తన సర్వీసు రివాల్వర్ తో ఇద్దరిని బెదిరించి తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లాడు. ఇబ్రహీంపట్నం చెరువు కట్టవద్ద కారుకు ప్రమాదం జరగటంతో బాధితులు అక్కడినుంచి తప్పించుకుని వనస్ధలిపురం పోలీసు స్టేషనల్ ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగేశ్వరరావు కోసం గాలిస్తున్నారు. నాగేశ్వరరావు గతంలో బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో సీఐ గా విధులు నిర్వహించేవారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన నాగేశ్వరరావును అక్కడి నుంచి మారేడ్ పల్లి పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.
Also Read : Rains In Andhra Pradesh : ఏపీలోనూ దంచికొడుతున్న వర్షాలు