Dowry Harassment
Dowry Harassment : పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఏడాది తిరక్కుండానే కన్ను మూసిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని హుజూర్ నగర్, సుందరయ్య నగర్ కు చెందిన ఆత్కూరి సుజాత రెండో కుమార్తె మౌనిక (19) అదే ప్రాంతానికి చెందిన పంగ నాగరాజు అనే యువకుడిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి గతేడాది మే 14న పెళ్లి చేసుకుంది.
పెళ్లి సమయంలో వరకట్నం కింద 20 కుంటల భూమిని ఇచ్చేందుకు మౌనిక తల్లి సుజాత ఒప్పుకుంది. గత కొంతకాలంగా నాగరాజు మౌనికను వేధించటం మొదలెట్టాడు. పెళ్లి సమయంలో ఇస్తానన్న భూమిని తన పేరున రిజష్ట్రేషన్ చేయించుకు రమ్మనమని వేధించసాగాడు
భర్త వేధింపులు భరించలేని మౌనిక మే 1 శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. గమనించిన భర్త ఆమెను వెంటనే స్ధానిక ఆస్పత్రికి తరలించాడు. కానీ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటుచేసి భర్త నాగరాజుతో అంత్యక్రియలు పూర్తి చేయించినట్లు ఎస్సై తెలిపారు.