Married Woman Missing : ఫోన్‌ కాల్ తెచ్చిన తిప్పలు…ఈడొచ్చిన ముగ్గురు పిల్లలతో తల్లి ఆదృశ్యం

తనకంటే  వయస్సులో చిన్నవాడైన  వ్యక్తితో ఓ మహిళ పరిచయం కాపురంలో చిచ్చు రేపింది. ఈడోచ్చిన పిల్లలతో వెళ్లిన మహిళ ఆదృశ్యం అవటం హైదరాబాద్ లో కలకలం రేపింది.

Married Woman Missing : తనకంటే  వయస్సులో చిన్నవాడైన  వ్యక్తితో ఓ మహిళ పరిచయం కాపురంలో చిచ్చు రేపింది. ఈడోచ్చిన పిల్లలతో వెళ్లిన మహిళ ఆదృశ్యం అవటం హైదరాబాద్ లో కలకలం రేపింది.

నగరంలోని కామాటిపుర పోలీసు స్టేషన్ పరిధిలోని గుమ్మాస్ ప్రాంతానికి చెందిన కిషన్‌శర్మ, పూజ అలియాస్ రాగిణి (34) దంపతులు నివసిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం వీరికి పెళ్లి అయ్యింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వీరు గతంలో మలక్ పేటలో నివసించే సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న పవన్ (30) అనే వ్యక్తితో పూజ తరచుగా మాట్లాడుతూ ఉండేది. ఈ విషయమై పూజకు, కిషన్‌శర్మకు మధ్య గొడవలయ్యేవి. ఆ తర్వాత నుంచి పూజ,పవన్ లు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవారు.

దీంతో కిషన్ తన మకాం మలక్‌పేట నుంచి 8 నెలల క్రితం కామాటిపురా లోని మురళీ గుమ్మాస్ కు మార్చాడు. ఇల్లు మార్చినా   కానీ పూజ, మురళీతో ఫోన్ లో మాట్లాడటం ఆపలేదు. వాళ్లిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో పవన్ కుడా తన మాకాంను మలక్‌పేట నుంచి మురళీగుమ్మాస్ కు మార్చాడు. మళ్లీ కిషన్‌శర్మ తన భార్య పూజతో గొడవ పడ్డాడు.

ఈక్రమంలో జులై 16వ తేదీన తిరుపతి వెళ్లివస్తానని తన ముగ్గురు ఆడపిల్లలు కీర్తి (17), మోహిని ఆలియాస్‌ మీనా (14), గోపి (12)లను తీసుకుని పూజ ఇంటి నుంచి వెళ్లింది. వారంరోజులైనా ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆందోళన చెందిన కిషన్   కామాటిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు