లేడీస్ టైలర్ తో ప్రేమాయణం – అనుమానంతో హత్య

అక్రమ సంబంధాల వల్ల కుటుంబ వ్యవస్ధ దెబ్బతింటోందని తెలిసినా అటువంటి వాటివైపే ప్రజలు మొగ్గు చూపటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న లేడీస్ టైలర్… ఆవ్యక్తి ఆనుమానానాకి బలైపోయింది.
తమిళనాడు, చెన్నై, తాంబరం, వండలూరు విఘ్నేశ్వర నగర్ లో గోపి(55), యశోదరాణి(48) దంపతులు నివాసం ఉండేవారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. యశోదకు కుట్టు పని రావటంతో సొంతగా టైలరింగ్ షాప్ పెట్టుకుంది. ఆమె పనితనం బాగుండటంతో ఆమెకు గిరాకీ పెరిగింది.
షాపుకు వచ్చే మగవాళ్లతో యశోద చనువుగా మాట్లాడటం చూసిన గోపి ఆమెతో తరచూ గొడవపడతూ ఉండేవాడు. భర్త అనుమానంతో కుటుంబంలో గొడవలు పెరగటంతో పిల్లలిద్దర్నీతీసుకుని యశోద, భర్తనుంచి విడిపోయి, వేరు కాపురం పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు తాంబరంలోని వెటై కన్నాపూర్ కు చెందిన సెల్వకుమార్(38) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. చూడగానే ఆకర్షణీయమైన అంగసౌష్టవం, ఉండి అందంగా వున్న యశోదతో సెల్వకుమార్ మరింత సన్నిహితంగా మెలగసాగాడు.
భర్తకు దూరంగా ఉంటోందని తెలిసి…తనకంటే 10 ఏళ్లు పెద్దదైనా సరే యశోదా ఆంటీతో మరింత చనువు పెంచుకున్నాడు సెల్వకుమార్. క్రమేపి ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. భర్త నుంచి దూరంగా ఉండటం…ఒంటరి తనంతో కూడా యశోద, సెల్వకుమార్ తో యధేఛ్చగా రాసలీలలు సాగించింది. ఇద్దరి మధ్య శృంగారానికి అడ్డంకులు లేకపోవటంతో వారు జీవితాన్ని ఎంజాయ్ చేయసాగారు. ప్రియుడు మోజులో పడిన యశోద సెల్వకుమార్ కు ఆర్ధిక సహాయంకూడా చేయటం మొదలెట్టింది.
ఆంటీ ఇచ్చే డబ్బుతో సెల్వకుమార్ జల్సాలు చేసేవాడు. ఇటీవల కాలంలో ఆమెకు పని ఒత్తిడి ఎక్కువ అవటం వలన ప్రియుడితో ఎక్కువ సేపు గడపలేక పోతోంది. షాపు కు వచ్చిన సెల్వకుమార్ తో తక్కువ గా మాట్లాడి పంపించి పనిలో పడిపోయేది. ఇది నచ్చని సెల్వకుమార్ యశోదా వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించటం మొదలెట్టాడు. ఈ విషయమై ఆమె అతడికి వివరణ కూడా ఇచ్చింది.
తన కెవరితోనూ ఇతర సంబంధాలు లేవని…కేవలం పని ఒత్తడి వల్లే ఎక్కువ సేపు గడపలేక పోతున్నానని చెప్పినా సెల్వకుమార్ అనుమానం తీరలేదు. గత మంగళవారం జూన్ 9న షాపుకు వచ్చిన సెల్వకూమార్ ఆమెను గదిలోకి తీసుకువెళ్లి కాసేపు ఏకాంతంగా గడిపాడు. వెళ్తూ, వెళ్తూ తనతో తప్ప షాపుకు వచ్చే ఇంకే మగవాళ్లతోనూ మాట్లాడవద్దని ఆమెను హెచ్చరించాడు.
అయితే వ్యాపార రీత్యా అది తన వల్ల కాదని, మగవారితో మాట్లాడవలసి వస్తుందని…ఇలా అనుమాన పడితే ఎలా అని ఆమె బదులిచ్చింది. ఈ క్రమంలో ఇద్దరిమధ్య మటామటా పెరిగింది. సహనం కోల్పోయిన సెల్వకుమార్ అక్కడే ఉన్న కత్తెరతో ఆమెను విచక్షణా రహితంగా పొడిచాడు. కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో యశోద అక్కడి కక్కడే చనిపోయింది. ఆమె మరణించటంతో సెల్వకుమార్ పరారయ్యాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులునిందితుడి కోసం గాలిస్తున్నారు.