Mangalore Bank Robbery : కర్నాటకలో మరో భారీ చోరీ.. బ్యాంకులోని రూ.15 కోట్ల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

బ్యాంకులో భారీ చోరీ.. బీహార్ గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Mangalore Bank Robbery : కర్నాటకలో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. నిన్న బీదర్, ఇవాళ మంగళూరులో దొంగలు రెచ్చిపోయారు. మంగళూరులోని ఉల్లాల్ కేసీ రోడ్ లో కో ఆపరేటివ్ బ్యాంకులో దొంగల ముఠా భారీ చోరీకి పాల్పడింది. బ్యాంకు ఉద్యోగులని గన్ తో బెదిరించి డబ్బు, నగలతో ఉడాయించారు.

15 కోట్ల నగదు, రూ.5లక్షల విలువైన నగలు దోపిడీ..
ట్రెజరీలోని 15 కోట్ల రూపాయల నగదు, 5 లక్షల విలువైన నగలను దొంగలు దోచుకెళ్లారు. బీహార్ గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు లంచ్ టైమ్ లో ఈ దోపిడీ జరిగింది. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. బీహార్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : బాబోయ్.. 30 నిమిషాలు గాల్లోనే తల కిందులుగా.. హైదరాబాద్ నుమాయిష్ లో తప్పిన పెను ముప్పు..

పట్టపగలే బ్యాంకులో భారీ చోరీ..
దొంగల ముఖలకు మాస్కులు ఉన్నాయి. వారికి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. కోటెకర్ వ్యవసాయ సేవా సహకార సంఘ బ్యాంకు.. మంగళూరు సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.20 నిమిషాల మధ్యలో ఈ దోపిడీ జరిగింది. దొంగలు హిందీలో మాట్లాడారని బ్యాంకు సిబ్బంది తెలిపారు.

ఆయుధాలు చూపించి బ్యాంకు ఉద్యోగులను బెదిరించారు. స్ట్రాంగ్ రూమ్ తలుపు తెరవాలని బ్యాంకు మేనేజర్ ను బెదిరించారు. స్ట్రాంగ్ లో రూమ్ దాచి ఉంచిన నగదు, నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రింటర్ ను కూడా వారు ఎత్తుకెళ్లారు. అలాగే సిబ్బంది నుంచి బలవంతంగా వారి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఆ తర్వాత బ్లాక్ కారులో అక్కడి నుంచి పారిపోయారు.

 

Also Read : అమిత్ కుమార్ ముఠా కోసం పోలీసుల వేట.. బీదర్-అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..