Hyderabad Numaish : బాబోయ్.. 30 నిమిషాలు గాల్లోనే తల కిందులుగా.. హైదరాబాద్ నుమాయిష్ లో తప్పిన పెను ముప్పు..
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

Hyderabad Numaish : హైదరాబాద్ నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పెను ప్రమాదం తప్పింది. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఓ అమ్యూజ్ మెంట్ రైడ్ లో టూరిస్టులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. 25 నిమిషాలకు పైగా తల కిందులుగా నిలిచిపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
బ్యాటరీ సమస్య కారణంగా ఇలా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. జెయింట్ వీల్ తరహాలో ఉండే అమ్యూజ్ మెంట్ రైడ్.. పైకి వెళ్లిన తర్వాత బ్యాటరీ సమస్య కారణంగా ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా సుమారు 25 నిమిషాలు పాటు గాల్లోనే ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. చివరికి నిర్వహకులు సమస్యను పరిష్కరించడంతో టూరిస్టులు కిందకు దిగి వచ్చారు.
కాసేపు సరదాగా గాల్లో తిరగొచ్చని పర్యాటకులు భావిస్తే.. వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అమ్యూజ్ మెంట్ రైడ్ గాల్లో తలకిందులుగా నిలిచిపోవడంతో అందులో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. ప్రాణాలను గుప్పెట పెట్టుకుని గాల్లోనే గడిపారు. కాగా, నిర్వాహకుల తీరుపై పర్యాటకులు తీవ్రంగా మండిపడ్డారు. టూరిస్టుల ప్రాణాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. ఎలాంటి సమస్యలు రాకుండా ముందే చూసుకోవాలి కదా అంటున్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read : దమ్ముంటే రా.. లై డిటెక్టర్ టెస్ట్ పై సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్..