KTR Challenge Cm Revanth Reddy : దమ్ముంటే రా.. లై డిటెక్టర్ టెస్ట్ పై సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్..
నీకు ధైర్యముంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైమ్ నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు. నిజాయితీగా నా చెయ్యి ఇస్తా.

KTR Challenge Cm Revanth Reddy : మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా? అని సీఎం రేవంత్ ని అడిగారు. ధైర్యముంటే లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈడీ అధికారులు సుదీర్ఘంగా ఏడున్నర గంటల పాటు కేటీఆర్ ను విచారించారు.
ముందుకు రా.. ఎవరి నిజాయితీ ఏంటో రాష్ట్రం మొత్తం చూస్తుంది…
”ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా, ఇంతమంది ఉన్నతాధికారుల సమయం వృథా అయ్యేలా, ఇన్ని మీడియా సంస్థల టైమ్ వేస్ట్ అయ్యే విధంగా కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్నా. ధైర్యముంటే ముందుకు రా. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, ఈడీ ఆఫీస్ లో అయినా సరే.. నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. మీరు కూడా రండి. ఇద్దరం కూర్చుందాం. దొంగ ఎవరో తెలిసిపోతుంది. ఎవరి నిజాయితీ ఏంటో రాష్ట్రం మొత్తం చూస్తుంది.
ఎనీ టైమ్, ఎనీ సెంటర్.. నేను రెడీ..
మీకు ధైర్యముంటే వెంటనే నిర్ణయం తీసుకోండి. డేట్ మీరే చెప్పండి, టైమ్ మీరే చెప్పండి, ప్లేస్ మీరే చెప్పండి. నిజాయితీగా నా చెయ్యి ఇస్తా. లై డిటెక్టర్ టెస్ట్ కి మీరు కూడా కూర్చోండి. ఈడీ విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతా. ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే అంతిమంగా న్యాయం, ధర్మం, నిజం, నిజాయితీ గెలుస్తాయి. కోర్టులు, న్యాయమూర్తులపై మాకు విశ్వాసం ఉంది” అని కేటీఆర్ అన్నారు.
Also Read : కేటీఆర్‌ని కక్ష పూరితంగా అరెస్ట్ చేయాలని రేవంత్ ప్రభుత్వం యత్నాలు: మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెట్టింది..
”ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే.. విచారణ అధికారులను, విచారణ సంస్థలను గౌరవించి 9వ తేదీన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే.. ఆ విచారణకు కూడా హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు అడిగాయి.
దాదాపు 7, 8 గంటల పాటు అడిగిందే అడిగారు. వివరాలు తీసుకున్నారు. రెండు సంస్థలకు నేను చెప్పిందేమిటంటే.. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. సంతృప్తికరంగా చెప్తా. పూర్తి విచారణకు సహకరిస్తా. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే వ్యక్తిగా కచ్చితంగా విచారణకు పూర్తి సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది” అని కేటీఆర్ అన్నారు.
Also Read : దూకుడు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్..! ఈటల, హరీశ్, కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా?