Medak Lockup Death : మెదక్ లాకప్‌డెత్ ఘటనలో సీఐ, ఎస్ఐపై వేటు
సంచలనం రేపిన ఖదీర్ ఖాన్ లాకప్ డెత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. మెదక్ టౌన్ సీఐ మధు, ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. సీఐ, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా మెదక్ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న మెదక్ లాకప్ డెత్ ఘటనపై సీఐ, ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.

Medak Lockup Death : సంచలనం రేపిన ఖదీర్ ఖాన్ లాకప్ డెత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. మెదక్ టౌన్ సీఐ మధు, ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. సీఐ, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా మెదక్ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న మెదక్ లాకప్ డెత్ ఘటనపై సీఐ, ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడనే అనుమానంతో మెదక్ పోలీసులు ఖదీర్ అనే వ్యక్తిని గత నెల 29న అరెస్ట్ చేశారు. 5 రోజుల తర్వాత అతడిని వదిలి పెట్టారు. అయితే, అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఖదీర్ కుటుంబసభ్యులు ఆరోపించారు.
Also Read..Delhi: పద్నాలుగేళ్ల బాలికపై తాంత్రికుడి అత్యాచారం.. భూతవైద్యం పేరుతో ఘాతుకం
పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే మెదక్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఖదీర్ చనిపోయాడు. ఈ ఘటనపై ఖదీర్ భార్య డీజీపీకి ఫిర్యాదు చేసింది. దీనిపై సీరియస్ అయిన డీజీపీ.. పూర్తి స్థాయి విచారణ జరిపి సీఐ, ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మెదక్ పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్ ఘటన సంచలనం రేపింది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొట్టి కొట్టి చంపడమేనా ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే అని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ ఘటనపై డీజీపీ అంజనీకుమార్ సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఐజీ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కామారెడ్డికి చెందిన సీనియర్ పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలని, ఐజీ చంద్రశేఖర్ విచారణను పర్యవేక్షించాలని డీజీపీ సూచించారు. మెదక్ సీఐ, ఎస్‌ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.
మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్‌ఖాన్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16న రాత్రి మరణించాడు. దొంగతనం కేసులో పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే తన భర్త మృతి చెందాడంటూ ఖదీర్ ఖాన్ భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
గత నెల 27న మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీలో గొలుసు దొంగతనం జరిగిందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఖదీర్‌ఖాన్‌ను గత నెల 29న అదుపులోకి తీసుకున్నారు. 2వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచారు ఆ తర్వాత అతని భార్యను పిలిపించి ఖదీర్‌ను ఆమెకు అప్పగించారు. ఆ తర్వాత ఖదీర్ అనారోగ్యం పాలవ్వడంతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఖదీర్ మృతి చెందాడు.