CMR Collge Row : గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు? కలకలం రేపుతున్న వెంటిలేటర్‌పై వేలి ముద్రలు..! సీఎంఆర్ కాలేజీలో అసలేం జరిగింది..

రాత్రి సమయంలో హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని ఫిర్యాదు చేశారు.

CMR Collge Row : మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్రికత్త కొనసాగుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై కాలేజీలో చదువుతున్న విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగారు. బాత్రూమ్స్ లో తాము స్నానాలు చేస్తుండగా.. ఫోన్ లో వీడియోలు తీస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి నాయకులు కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

వీడియో రికార్డింగ్ వంట చేసే వారి పనేనా?
కాలేజీలోని బాలికల వసతి గృహం వాష్ రూమ్స్ లో కెమెరాలు ఏర్పాటు చేశారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. హాస్టల్ లో వంట చేసే సిబ్బందిపైనే స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అనుమానితులను విచారించారు. హాస్టల్ సిబ్బందిపై అమ్మాయిలు పలు ఆరోపణలు చేశారు. రాత్రి సమయంలో హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Also Read : తెలంగాణలో బాలికల గురుకులాల‌పై ఫోక‌స్.. అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు

గర్ల్స్ హాస్టల్ దగ్గర సెక్యూరిటీ లేదని, రాత్రి వేళ అబ్బాయిలు వస్తున్నారని ఆందోళన..
అలాగే హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదన్నారు. లేడీస్ హాస్టల్ కు, వర్కర్స్ కు ఉండే ప్లేస్ కి మధ్య అడ్డుగోడ లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాము ఫిర్యాదు చేసినా తమనే తప్పు పడుతున్నారని స్టూడెంట్స్ వాపోయారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సెల్ ఫోన్లలోని డేటా ఆధారంగా ఈ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆ గుర్తులు ఏంటి?
* సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లో వీడియోల రికార్డింగ్ కలకలం..
* హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు?
* బయటి నుంచి కెమెరా పెట్టినట్లు అద్దంపై ఆనవాళ్లు..!
* రెండు మూడు చోట్ల కెమెరాలు పెట్టినట్లు అనుమానం
* రాత్రి కెమెరాను గుర్తించిన ఓ విద్యార్థిని
* రాత్రి సమయంలో హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని ఆరోపణ

* హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదన్న అమ్మాయిలు
* లేడీస్ హాస్టల్ కి, వర్కర్స్ కి ఉండే ప్లేస్ మధ్య అడ్డుగోడ లేదని ఆరోపణ
* ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
* అనుమానం ఉన్న వారిని ప్రశ్నిస్తున్న పోలీసులు
* అనుమానితుల వివరాలు బయటపెట్టాలని విద్యార్థుల డిమాండ్

Also Read : వీడెవడండీ బాబూ.. ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు.. వీడియో వైరల్..