Viral Video : వీడెవడండీ బాబూ.. ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు.. వీడియో వైరల్..

కిందకు దిగి రావాలని గ్రామస్తులు ఆ మందుబాబును చాలాసేపు వేడుకున్నారు.

Viral Video : వీడెవడండీ బాబూ.. ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు.. వీడియో వైరల్..

Updated On : January 2, 2025 / 12:38 AM IST

Viral Video : మందుబాబులు మద్యం మత్తులో చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. పెగ్ వేశారంటే చాలు.. వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కొందరైతే రెచ్చిపోతారు. రోడ్లపై నానా హంగామా చేస్తారు. ఇంకొందరైతే ఏకంగా దాడులకు తెగబడతారు. పెగ్గేసిన సమయంలో వారిని కంట్రోల్ చేయడం ఒకింత కష్టమనే చెప్పాలి. ఇక, కొందరు మందుబాబులు చేసే సాహసాలు చూస్తే.. దిమ్మతిరిగిపోవడం ఖాయం.

తాజాగా, ఓ మందు బాబు ఏం చేశాడో తెలుసా.. విద్యుత్ స్థంభం పైకి ఎక్కి కరెంట్ వైర్ల మీద హాయిగా పడుకున్నాడు. దీంతో ఆ ఊరి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అతడిని కాపాడేందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. మందుబాబు కరెంట్ తీగలపై పడుకున్న దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : పొంచి ఉన్న ప్రమాదం? శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజ్.. ఆందోళనలో ఇంజినీర్లు..!

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగాపురంలో మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. న్యూఇయర్ వేడుకలకు డబ్బులు ఇవ్వటం లేదని కరెంట్ పోల్ పైకి ఎక్కేశాడు. తనకు డబ్బులు ఇవ్వాలంటూ కరెంట్ తీగలపై పడుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పరుగులు పెట్టారు. అతడికి అపాయం కలగకుండా వెంటనే విద్యుత్ నిలిపివేశారు. దాంతో పెను ప్రమాదమే తప్పింది.

కరెంటు పోల్ పైకి ఎక్కిన మందుబాబు.. హాయిగా కరెంట్ తీగలపై పడుకున్నాడు. కిందున్న వారికేమో టెన్షన్ తో చెమట్లు పట్టేశాయి. కిందకు దిగి రావాలని గ్రామస్తులు ఆ మందుబాబును చాలాసేపు వేడుకున్నారు. చివరికి అతి కష్టం మీద అతడిని కిందకు తీసుకురాగలిగారు. అతడికి ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, న్యూఇయర్ సందర్భంగా మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని ఇంట్లో వాళ్లని అడిగాడు ఆ యువకుడు. వారు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో.. కోపంతో ఊగిపోయిన మందుబాబు.. వీధిలోకి వచ్చి.. ఇదిగో ఈ విన్యాసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మందుబాబు సాహసం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వీడెవడండీ బాబూ అని కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరికొందరేమో ఆ మందుబాబు గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

 

Also Read : రేషన్ బియ్యం ఉచ్చు పేర్నినానికే పరిమితం కాలేదా?