Srisailam Hydropower Station : పొంచి ఉన్న ప్రమాదం? శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజ్.. ఆందోళనలో ఇంజినీర్లు..!

వాటర్ లీక్ అవుతున్న ప్రాంతాన్ని హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు పరిశీలించారు. తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్థానిక ఇంజినీర్లను వారు ఆదేశించారు.

Srisailam Hydropower Station : పొంచి ఉన్న ప్రమాదం? శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజ్.. ఆందోళనలో ఇంజినీర్లు..!

Updated On : January 1, 2025 / 11:35 PM IST

Srisailam Hydropower Station : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీ అవుతోంది. ఒకటో యూనిట్ నుంచి వాటర్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదనతో పాటు పంపు మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యామ్ లోకి నీటి మళ్లింపు కొనసాగుతుంది.

నీటి లీకేజీ జరుగుతున్న ప్రాంతంలో మరమ్మత్తులు చేపట్టకపోతే జీరో ఫ్లోర్ లాక్ పడిపోయే ప్రమాదం పొంచి ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. మరోవైపు వాటర్ లీక్ అవుతున్న ప్రాంతాన్ని హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు పరిశీలించారు. తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్థానిక ఇంజినీర్లను వారు ఆదేశించారు.

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్ లో ప్రమాదం పొంచి ఉందని చెప్పొచ్చు. గత వారం రోజుల నుంచి మొదటి యూనిట్ లో ఒక్కాసారిగా నీరంతా లీకేజీ అవుతోంది. విషయం తెలిసిన వెంటనే జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఇంజినీర్ల బృందం పర్యటించింది. ఈ ప్రవాహం రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ఉంటుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ లోనే ఈ నీటి లీకేజీ వ్యవహారం మొదలైనప్పటికీ.. ఏ విధంగా లీకేజీ అవుతోంది అనేది తెలుసుకోవడానికి ఇరిగేషన్ శాఖ అధికారులు సీసీ కెమెరాలను బిగించారు.

Also Read : తెలంగాణ బీజేపీలో ఈటల మౌనం వెనుక మతలబేంటి?

మొదటి యూనిట్ లో స్లాబ్ ద్వారా అక్కడ నీటి లీకేజీ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి వాటర్ లీకేజీని ఆపగలిగితేనే ప్రమాదం తొలగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. మొదటి యూనిట్ పూర్తి స్థాయిలో డ్యామేజీ అయ్యే అవకాశం ఉందని ఇంజినీర్ల బృందం నిర్ధారించినట్లు తెలుస్తోంది.

మొదటి యూనిట్ లో ఉన్న నీటినంతా పంపు మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యామ్ లోకి తరలించే ప్రాసెస్ మొదలు పెట్టారు. వారం పది రోజుల పాటు నీటినంతా తోడేశాక.. ఎడమ గట్టు మీదున్న జల విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుని మరమ్మతులు చేపట్టే విధంగా జల విద్యుత్ కేంద్రం అధికారులు నిర్ధారించారు.

Also Read : రేషన్ బియ్యం ఉచ్చు పేర్నినానికే పరిమితం కాలేదా?