misbehavior on a student : విద్యార్ధినిపై కాలేజీ యాజమాన్యం అసభ్య ప్రవర్తన

ఈ కాలేజీలో చదవలేనని.. సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికి వెళ్లిపోతానని అడిగిన విద్యార్ధిని, ఆమె చిన్నమ్మపై   హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కాలేజీ   డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Medical Academy director misbehavior on student , FIR Registered : ఈ కాలేజీలో చదవలేనని.. సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికి వెళ్లిపోతానని అడిగిన విద్యార్ధిని, ఆమె చిన్నమ్మపై   హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కాలేజీ   డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఎల్బీనగర్  పోలీసు స్టేషన్ పరిధిలోని  డాక్టర్ జీ మెడికల్ అండ్ ఐఐటీ అకాడమీలో కీర్తన అనే విద్యార్ధిని రెండేళ్లుగా చదువుతోంది. కళాశాల ఫీజు విషయంలో విద్యార్ధినికి, యాజమన్యానికి మధ్య గత కొంత కాలంగా గొడవ జరుగుతోంది.   కాగా…స్టడీ అవర్స్ లో అకాడమీ డైరెక్టర్ జగన్ యాదవ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని.. ఇది తట్టుకోలేక హాస్టల్ లో అనేక సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత విద్యార్ధిని ఆరోపించింది.

ఇక ఈ కాలేజీలో చదవలేను… నా సర్టిఫికెట్లు ఇస్తే నేను ఇంటికి వెళ్లిపోతానని అడిగింది. రూ.50 వేలు ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తా అని యాజమాన్యం కోరగా, ఆ మొత్తాన్ని చెల్లించింది. అయినా కాలేజీ డెరెక్టర్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేసింది.

తనను ఇంటికి తీసుకువెళ్లేందుకు, చిన్నమ్మ మమత కాలేజీకి వస్తే .. ఆమెను కూడా కాలేజీ  డైరెక్టర్ జగన్ యాదవ్, డ్రైవర్ శివ అడ్డుకున్నారని ఇంటికి తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోగా గేటు వద్ద దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని బాధిత విద్యార్ధిని ఆరోపించింది.

కరోనా సమయంలో హాస్టల్ మూసివేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలి చిన్నమ్మతోకలిసి విద్యార్ధిని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాలేజీ డైరెక్టర్ జగన్ యాదవ్, శివలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు