Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం

జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెం. 45లో అదుపుతప్పిన కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది.

Jubilee Hills Car Accident

Car Incident in Jubilee Hills : జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెం. 45లో అదుపుతప్పిన కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, కారు బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారును నడపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.