Minor Boy Raped Baby Girl
minor boy raped girl child in uttar pradesh : స్మార్ట్ ఫోన్ల వినియోగం… ఇంటర్నెట్ అతి చౌకగా లభ్యం అవటం మొదలయ్యాక నేరాలు పెరిగినట్లు తెలుస్తోంది. చాలా కేసుల్లో స్మార్ట్ ఫోన్ ప్రస్తావన ఉంటూనే ఉంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో 13 ఏళ్ల బాలుడు స్మార్ట్ ఫోన్ లో నీలిచిత్రాలు చూసి వాటి ప్రభావంతో రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.
ఉత్తర ప్రదేశ్ లోని బలియా జిల్లా రేవతి బ్లాకు లోని ఓ గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో ఉన్న చిన్నారి ఆడుకోటానికి పొరుగున ఉన్న ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఉన్న 13 ఏళ్ల బాలుడు అప్పటికే స్మార్ట్ ఫోన్లో నీలిచిత్రం చూసి ఉన్నాడు.
ఆ బాలుడు మనో వికారంతో బాలిక రాగానే ఆమెపై అఘాయిత్యం చేశాడు. బాలిక అమ్మమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రేవతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.