Murder
Minor Girl Kills Mother : నవ మోసాలు మోసి..కని పెంచిన కన్న కూతురే తల్లిపాలిట శాపంగా మారింది. ఎలాంటి కష్టం రాకుండా..చిన్నప్పటి నుంచి పెంచిన ఆ తల్లినే కడతేర్చిందో కూతురు. సభ్యసమాజం తలదించుకొనేలా వ్యవహరించింది. హత్య చేసే సమయంలో బాయ్ ఫ్రెండ్ సలహాలు తీసుకుని మరీ హత్య చేసింది. బాయ్ ఫ్రెండ్ తో సంబంధం వద్దని చెప్పడమే ఆ తల్లి చేసిన పాపం. 16 సంవత్సరాలున్న బాలిక హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో వెలుగు చూసింది.
Read More : AP SSC Results : నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
ఫరీదాబాద్ లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. బాయ్ ఫ్రెండ్ తో సంబంధం వద్దని తల్లి..బాలిక (16)…కు చెప్పింది. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడ వద్దని తల్లి చెప్పడాన్ని ఆ బాలిక సహించలేకపోయింది. ప్రతీకారంతో రగలిపోయింది. దీంతో తల్లిపై కక్ష పెట్టుకుంది. ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో జులై 10వ తేదీ…అర్ధరాత్రి దాటిన బాయ్ ఫ్రెండ్ వీడియో కాల్ లో ఎలా హత్య చేయాలో సూచనలు ఇచ్చాడు. అంతకుముందే బాలిక ఇంటికి వచ్చిన బాయ్ ఫ్రెండ్..నిద్రమాత్రలు ఇచ్చి వెళ్లాడు.
నిమ్మరసంలో మాత్రలు కలిపి…తల్లికి తాగించింది. అందులో ఏముందో ఆ తల్లి గ్రహించలేకపోయింది. అనంతరం ఆమె మత్తులోకి జారుకుంది. బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన సలహాలతో ఆమెను చంపేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారించారు. కన్న కూతురు హత్య చేసిందని, బాయ్ ఫ్రెండ్ సహకరించిందని పోలీసులు నిర్ధారించారు. కోర్టులో వీరిద్దరినీ హాజరుపరచగా…యువకుడిని ఫరీదాబాద్ జైలుకు తరలించారు. బాలికను జువెనల్ హోంకు తరలించారు.