శుభకార్యానికి వెళ్లి వస్తుండగా : రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారుడు మృతి

  • Publish Date - February 16, 2019 / 04:10 PM IST

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం మండలం కొత్తగూడెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్‌ రూట్‌లో వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా జిట్టాపురానికి చెందిన ధనమ్మ, యాదగిరిగా గుర్తించారు. మునుగోడులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. తల్లీ కుమారుడు ఓకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.